Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ

నిజామాబాద్

Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ

బాన్సువాడ పట్టణంలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామిజీ ఆధ్వర్యంలో సామూహిక మహా మండల పూజ నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 21, 2026 8:13 సా.
Shashi kiran Mottala
5 రోజులు ago
Share
Hanuman Maha Mandala Puja |
Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ

అక్షరటుడే, బాన్సువాడ: Hanuman Maha Mandala Puja | పట్టణంలోని జ్ఞాన సరస్వతి దేవి (Jnana Saraswati Temple) ఆలయ ప్రాంగణంలో హనుమాన్ దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామిజీ ఆధ్వర్యంలో సామూహిక మహా మండల పూజ నిర్వహించారు. అష్టోత్తర శతకుండాత్మక (108) సుందరకాండ పారాయణంతో (Sundarakanda Parayanam) కూడిన 162వ హనుమాన్ మహాయజ్ఞం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిపించారు.

Contents
  • Hanuman Maha Mandala Puja | ఎమ్మెల్యే పోచారం కుటుంబీకులు..
    • Hanuman Maha Mandala Puja | యజ్ఞశాలలో..

Hanuman Maha Mandala Puja | ఎమ్మెల్యే పోచారం కుటుంబీకులు..

మహాయజ్ఞంలో (Banswada Temple Event) ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla Pocharam Srinivas reddy) కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆయనతో పాటు పోచారం శంభు రెడ్డి, ప్రేమల దంపతులు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు దుర్గా ప్రసాద్ స్వామిజీ నేతృత్వంలో జరిగిన ఈ మహా మండలపూజలో వేద మంత్రోచ్చరణల మధ్య సుందరకాండ పారాయణం, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Hanuman Maha Mandala Puja | యజ్ఞశాలలో..

యజ్ఞశాలలో అష్టోత్తర శతకుండాలతో నిర్వహించిన హోమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హనుమాన్ దీక్ష ద్వారా ఆధ్యాత్మిక శక్తి, (Telangana News) మనోబలం పెరుగుతాయని, సమాజంలో ఐక్యత, శాంతి నెలకొల్పడంలో ఇలాంటి యజ్ఞాలు(Spiritual Events India) ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలందరూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని సానుకూల జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాన్సువాడ పట్టణానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

pocahram2

 

Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి
Red Sorghum Price | ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేముల వినతి
Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్​ సీజ్​
Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
TAGGED:Banswada Temple EventHanuman PujaJnana Saraswati Templespiritual events indiaSundarakanda Parayanam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Modi Iran Call Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
Next Article Global Crisis Warning Global Crisis Warning | ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది : రక్షణ మంత్రి రాజ్​నాథ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?