అక్షరటుడే, ఎల్లారెడ్డి: Hanuman Shobha Yatra | హనుమాన్ జయంతి ఉత్సవాలను ఎల్లారెడ్డిలో ప్రజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. హనుమాన్ నామస్మరణతో ఎల్లారెడ్డి మార్మోగింది. పట్టణంలోని అన్ని హనుమాన్ ఆలయాలను ముస్తాబు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయ ప్రముఖులు పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Hanuman Shobha Yatra | కమనీయంగా హనుమాన్ శోభాయాత్ర
ఎల్లారెడ్డి పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. భారీ హనుమాన్, రాముడి విగ్రహాలను ఊరేగిస్తూ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే పట్టణంతో పాటు గ్రామాల్లోని పలు ఆలయాలలో సందడి నెలకొంది. పట్టణంలోని హనుమాన్ శోభాయాత్ర ర్యాలీని సాతిలి బేస్ హనుమాన్ ఆలయం నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై హనుమాన్, శ్రీరాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ర్యాలీలో యువత హనుమాన్ జెండాలతో సందడి చేశారు. రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ.. జైశ్రీరామ్.. అంటూ యువకులు నృత్యాలు చేశారు. ప్రత్యేక బ్యాండ్ మేళాలు.. డీజే సౌండ్ లైటింగ్‌తో శోభాయాత్ర హనుమాన్ ఆలయం నుంచి డైలీ మార్కెట్, గాంధీచౌక్, బస్టాండ్ ఆలయం వరకు కొనసాగింది. ఊరేగింపు సందర్భంగా సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేష్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూ ధర్మం కోసం హిందూసమాజం ఏకం కావాలని బజరంగ్ దళ్ ప్రతినిధి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్రీకాంత్, కౌన్సిలర్లు సిద్ది శ్రీధర్, తిరుపతి, మహేందర్ , నాయకులు ప్రశాంత్ గౌడ్, విద్యాసాగర్, వినోద్, తులసి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి.. ఎమ్మెల్యే పోచారం
