Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hanuman Shobha Yatra | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు.. రూట్​మ్యాప్​ ఇదే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hanuman Shobha Yatra | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు.. రూట్​మ్యాప్​ ఇదే..

నిజామాబాద్

Hanuman Shobha Yatra | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు.. రూట్​మ్యాప్​ ఇదే..

జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 4:17 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Hanuman Shobha Yatra

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Hanuman Shobha Yatra | జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశ్వహిందూ పరిషత్ హిందూ సమ్మేళనం, బజరంగ్​దళ్​ హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతియేటా యాత్రను ఘనంగా నిర్వహించడం సాంప్రదాయంగా మారింది.

Contents
  • Hanuman Shobha Yatra | ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్య..
    • Hanuman Shobha Yatra| హైదరాబాద్ తర్వాత ఇందూరులోనే..
      • Hanuman Shobha Yatra | శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే..
      • Hanuman Shobha Yatra | ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల దారి మళ్లింపు
      • సీసీ, డ్రోన్ కెమెరాలతో పట్టిష్టమైన నిఘా..

Hanuman Shobha Yatra | ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్య..

హనుమాన్ శోభాయాత్రను గత పదేళ్ల నుంచి చూస్తూ.. ప్రతి ఏడాదికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు శోభాయాత్రలో పాల్గొనడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. భక్తులు ప్రతి ఏటా జిల్లా కేంద్రానికి తరలివచ్చి హనుమాన్ శోభాయాత్రలో (Hanuman Shobha Yatra) ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Hanuman Shobha Yatra| హైదరాబాద్ తర్వాత ఇందూరులోనే..

ప్రతి యేటా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ (Hyderabad) నగరంలో శోభాయాత్రకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇందూరులోనే అంత గొప్పగా యాత్ర జరుగుతుందని భక్తులు పేర్కొంటున్నారు. శోభాయాత్రలో వేలల్లో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. హైదరాబాద్ తర్వాత నిర్వహించే నిజామాబాద్​ (Nizamabad) నగరంలో జరిగే ర్యాలీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Hanuman Shobha Yatra | శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే..

గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహిస్తారు. యాత్ర కంఠేశ్వర్​ ఆలయం (Kanteshwar Temple) నుంచి ప్రారంభమయ్యే యాత్ర.. జడ్పీ చౌరస్తా, హ మాల్​వాడి, పాత ప్రభాస్ టాకీస్, రైల్వే ఫ్లైఓవర్ మీదుగా, గోదాం రోడ్, దేవి రోడ్ మీదుగా వెళ్తుంది. అక్కడి నుంచి మమతా సర్కిల్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఆజాంరోడ్, పెద్దబజార్, లక్ష్మి మెడికల్ మీదుగా చివరిగా ఆర్​ఆర్ చౌరస్తాకు చేరుతుంది. శోభాయాత్రలో దేవత విగ్రహాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. శోభాయాత్ర వెళ్లే మార్గాల్లో దుకాణాదారులు, వ్యాపారస్తులు తమ వాహనాలను రోడ్ల పక్కన నిలిపి ఉంచరాదని పోలీసులు తెలిపారు.

Hanuman Shobha Yatra | ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల దారి మళ్లింపు

హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వచ్చి పోయే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు బ​స్టాండ్, జడ్పీ క్రాస్ రోడ్, సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్, ఎస్​ఎఫ్​ఎస్ స్కూల్ రోడ్డు జంక్షన్ నుంచి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, నుంచి కంఠేశ్వర్ బైపాస్ జంక్షన్ చేరుకొని హైదరాబాద్​, ఆదిలాబాద్​, వరంగల్ వైపు వెళ్లాలి. తిరిగి ఇదే మార్గం గుండా నిజామాబాద్ బస్టాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. బోధన్ నుంచి వచ్చిపోయే వాహనాలు అర్సపల్లి రైల్వేగేట్ నుంచి కొత్త కలెక్టరేట్, నుంచి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, ఎస్​ఎఫ్​ఎస్ స్కూల్ రోడ్డు జంక్షన్ నుంచి సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్ జెడ్పీ జంక్షన్, ఎన్టీఆర్​ చౌరాస్తా, అర్టీసీ బస్టాండ్​ చేరుకోవాలి. బాన్సువాడ నుంచి వచ్చి పోయే వాహనాలు వర్ని చౌరస్తా నుంచి పులాంగ్ సర్కిల్, కోర్డు సర్కిల్, ఎన్టీఆర్​ చౌరస్తా, రైల్వేస్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవాలి.

సీసీ, డ్రోన్ కెమెరాలతో పట్టిష్టమైన నిఘా..

హనుమాన్​ శోభాయాత్రను శాంతియుతంగా జరిగేందుకు 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు దారి పొడవునా పోలీసు సిబ్బంది యాత్రను పర్యవేక్షిస్తూ ఉంటారన్నారు. పాత నేరస్తులపై నిఘా పటిష్టపర్చామని తెలియజేశారు. నిజామాబాద్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ , ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బంది, టీఎస్​ఎస్​పీ బెటాలియన్​ పోలీసులు, 20 స్పెషల్​ పార్టీ పోలీసులతో యాత్రకు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

ఇది కూడా చదవండి..: Ayyappa Blessings | అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా: ఎమ్మెల్యే ధన్​పాల్​

TRESA Insurance Support | రెవెన్యూ ఉద్యోగులకు ట్రెసా అండ.. రూ.75 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ
Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Digital Health Cards | ఉద్యోగులకు డిజిటల్​ హెల్త్​ కార్డులు
Municipal Workers Protest | మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయం ముట్టడి.. సొమ్మసిల్లిన పలువురు కార్మికులు
Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
TAGGED:CP Sai ChaitanyaHanuman Jayanti RallyHanuman Shobha YatraHyderabadKanteshwar TempleNizamabadNizamabad Newspolice security arrangementsroute map nizamabadtraffic diversion update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ayyappa Blessings Ayyappa Blessings | అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా: ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article Assam Uniform Civil Code Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?