అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Arrest | మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు బయలుదేరిన ఆయనను అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) , మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.
పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రీయల్ పార్క్ (Industrial Park) కోసం ప్రజల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. బాధిత రైతులను కలవడానికి ఆయన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో మంగళవారం ఉదయం ఆయనను అధికారులు హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంతో పరిగి పర్యటనకు బయలు దేరారు.

Harish Rao Arrest | బీఆర్ఎస్ నాయకుల ధర్నా
పరిగికి బయల్దేరిన నాయకులను అప్ప జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం పోలీసులు హరీశ్‌రావును, ఇతర నేతలను అరెస్ట్ చేశారు.
అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన బలహీన వర్గాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇండస్ట్రియల్ పార్కుల పేరిట గుంజుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాడటానికి బీఆర్ఎస్ వెళ్తుంటే అరెస్టులు చేసి, నిర్బందాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) వచ్చిన రెండున్నరేండ్లలో 10వేల ఎకరాల దళితులు, గిరిజనుల భూములు లాక్కున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: KTR Anger | బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం
