అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao fire | కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యసభలో గురువారం ఏపీలో విలీనం అయిన ఏడు తెలంగాణ మండలాల గురించి చర్చ జరిగింది. దీనిపై కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏడు మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందన్నారు. దీనిపై ఎక్స్ వేదికగా హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. ఏడు మండలాల విలీనం విభజన చట్టంలో లేదన్నారు. అలా చెప్పడం తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహమని మండిపడ్డారు. రాజ్యసభలో కేంద్ర కిషన్ రెడ్డి అబద్దాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయట పెట్టారని విమర్శించారు.
Harish Rao fire | మరోసారి ద్రోహం
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామ చేయకుండా పారిపోయిన కిషన్‌రెడ్డి నేడు మరోసారి పార్లమెంట్ సాక్షిగా ద్రోహానికి పాల్పడ్డారని హరీశ్‌రావు విమర్శించారు. విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీకి బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు.
Harish Rao fire | కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం
కాళేశ్వరంపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే కిషన్ రెడ్డి పార్లమెంట్లో చేయడం కాంగ్రెస్, బీజేపీ చీకటి పొత్తుకుసాక్ష్యమన్నారు. పొలాల్లో పారుతున్న కాళేశ్వరం జలాలను చూపించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణ వాదాన్ని రెప్రెజెంట్ చేయకుండా సప్రెస్ చేస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు.
దీనిని కూడా చదవండి : Musi Project NGT Relief | ఎన్జీటీలో ప్రభుత్వానికి ఊరట
