అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Letter | మాజీ మంత్రి హరీశ్‌రావు లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగాన్ని రక్షించాలని దేశం మొత్తం తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender)పై అనర్హత పిటిషన్‌ను ఇటీవల స్పీకర్ ప్రసాద్‌కుమార్ కొట్టి వేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. దీనిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి పోరాడుతున్నానని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తారన్నారు. తెలంగాణలో జరుగుతున్నది ఆయన చెప్పెదానికి విరుద్ధంంగా ఉందన్నారు.

Harish Rao Letter | రాజ్యాంగ నైతికత ఇదేనా
దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని హరీశ్‌రావు (Harish Rao) పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ స్పీకర్, “ఫిరాయింపుకు ఎటువంటి ఆధారాలు లేవు” అని పేర్కొన్నారని మండిపడ్డారు. మరొక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ బీ-ఫారమ్‌పై ఎన్నికల్లో పోటీ చేయడం ఫిరాయింపుకు నిదర్శనం కాకపోతే ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఇలాగే రక్షిస్తుందా అన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశానికి ఉపదేశించే “రాజ్యాంగ నైతికత” ఇదేనా అన్నారు. రాజ్యాంగాన్ని సమర్థించడానికి బదులుగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను రక్షించడానికి చూస్తోందన్నారు.
Harish Rao Letter | వెంటనే చర్యలు తీసుకోవాలి
ఢిల్లీలో రాజ్యాంగాన్ని సమర్థిస్తున్నామని చెప్పుకుంటూ.. తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ దానిని నీరుగార్చడానికి ఎలా అనుమతిస్తారని హరీశ్‌రావు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్‌పై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ తన రాజకీయాలకు తగినప్పుడు మాత్రమే రాజ్యాంగం గురించి మాట్లాడుతుందని ప్రజలు గుర్తిస్తారన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్‌లో చికిత్స

