అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Letter | ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)కి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government)పై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? లేక కావాలనే చేస్తున్న కుట్రనా అన్నారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదన్నారు.
Harish Rao Letter | చెలగాటం ఆడొద్దు
వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా వాడటం శోచనీయమని హరీశ్‌రావు అన్నారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని మానుకోవాలన్నారు. ఇంజనీరింగ్ నిబంధనలు, డిజైన్‌కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం తెలంగాణ రైతుల (Telangana farmers) జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హితవు పలికారు.
ఇది కూడా చదవండి..: Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ కాలేజీ డీన్
