Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hate Speech Bill | సోషల్​ మీడియాలో వేధింపులపై చర్యలు​.. కీలక బిల్లు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Hate Speech Bill | సోషల్​ మీడియాలో వేధింపులపై చర్యలు​.. కీలక బిల్లు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం

తెలంగాణతాజా వార్తలు

Hate Speech Bill | సోషల్​ మీడియాలో వేధింపులపై చర్యలు​.. కీలక బిల్లు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం

అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్​ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. సమాజంలో విద్వేష నివారణ కోసం బిల్లు ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 2:04 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Hate Speech Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hate Speech Bill | ప్రస్తుతం సోషల్​ మీడియా (Social Media)లో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తున్నారు. రాజకీయ నాయకులు, సినీ నటులను ట్రోల్ చేస్తున్నారు. అలాగే కులాలు, మతాలను కించపరిచేలా కొందరు పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. ఈ మేరకు హేట్​ స్పీచ్​ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్​ అసెంబ్లీ (Assembly)లో ప్రవేశ పెట్టారు.

Contents
  • Hate Speech Bill | రెండో రాష్ట్రంగా..
    • Hate Speech Bill | కఠిన చట్టం అవసరం
      • Hate Speech Bill | వ్యతిరేకించిన బీజేపీ

సమాజంలో విద్వేష నివారణ కోసం బిల్లు ప్రవేశపెడుతున్నామని మంత్రి పొన్నం (Minister Ponnam) ప్రకటించారు. సోషల్ మీడియా వేదికలపై కులమతాలను నిందిస్తూ, మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగాలు, రాతల ద్వారా జరిగే విధ్వంసాలను అరికట్టేందుకు బిల్లును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్షలు విధించేలా, బాధితులకు న్యాయం జరిగేలా బిల్లు రూపొందించామని తెలిపారు. నేరస్తులకు 1-7 ఏళ్లు జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు.

Hate Speech Bill | రెండో రాష్ట్రంగా..

ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థ విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష నేరాల స్వభావాన్ని, వాటి రూపాలను సమగ్రంగా పరిష్కరించడం లేదని మంత్రి అన్నారు. ఈ బిల్లును గతంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం (Government of Karnataka) ప్రవేశ పెట్టింది. తెలంగాణ రెండో రాష్ట్రంగా నిలిచింది.

Hate Speech Bill | కఠిన చట్టం అవసరం

బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి (MLA Yashaswini Reddy) మాట్లాడారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అసభ్య ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా ఆమె ఖండించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులతో వారిని మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలు, హేట్ స్పీచ్​తో ప్రాణాలు పోతున్నాయని, దీనిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Hate Speech Bill | వ్యతిరేకించిన బీజేపీ

హేట్ స్పీచ్ బిల్లును బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యతిరేకించారు. చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలని, గొంతు నొక్కడానికి కాదన్నారు. ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. లేదా హౌస్ కమిటీ వేయాలని కోరారు.

ఇది కూడా చదవండి..: KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​

Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి
Cyber Fraud | మాజీ ప్రొఫెసర్​కు సైబర్​ నేరగాళ్ల టోకరా.. రూ.కోటి స్వాహా
SC Reservations | ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : కల్వకుంట్ల కవిత
Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ
TAGGED:AssemblyGovernment of KarnatakaHate Speech BillMinister PonnamMLA Yashaswini ReddySocial Media
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KTR Warning Police KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​
Next Article Tata EV Discount Tata EV Discount | టాటా ఆఫర్​.. ఈవీ కార్లపై 20 శాతం రాయితీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?