అక్షరటుడే, వెబ్డెస్క్: HDFC Bank Share Crash | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. ఉదయం సెషన్లో 8.5 శాతం వరకు పతనమై 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. క్రితం ముగింపు రూ. 843 తో పోల్చితే రూ. 73 నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు (Hdfc Bank).. ఆ తర్వాత కొంత కోలుకుంది.
HDFC Bank Share Crash | పార్ట్ టైం ఛైర్మన్ రాజీనామా..
చివరికి 5.32 శాతం నష్టంతో రూ. 798 వద్ద స్థిరపడింది. పార్ట్ టైం చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ ఆటాను చక్రవర్తి అకస్మాతుగా రాజీనామా చేయడంతో బ్యాంకులో (Financial News) ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడడంతో ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు ఈ భారీ పతనాన్ని చూసింది.
HDFC Bank Share Crash | ఎందుకు రాజీనామా చేశారంటే?
అటాను చక్రవర్తి గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఫైనాన్స్ మంత్రిత్వ శాఖలో సెక్రెటరీగా, వరల్డ్ బ్యాంక్‌లో ఆల్టర్నేట్ గవర్నర్‌గా, (Share Market India) నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ చైర్మన్‌గా పనిచేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పార్ట్ టైం చైర్మన్‌గా, స్వతంత్ర డైరెక్టర్గా (Nifty Bank) కొనసాగుతున్నారు. అయితే రెండేళ్లుగా బ్యాంకులో అంతర్గత విషయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంటూ అయన ఆకస్మాత్తుగా రాజీనామా చేశారు.
గత రెండేళ్లలో బ్యాంకులో జరిగిన కొన్ని విషయాలు, (Stock Crash News) పద్ధతులు తన వ్యక్తిగత విలువలు, నీతి నియమాలకు (Banking Sector India) సరిపోలడం లేదని లేఖలో పేర్కొన్నారు. ‘ఇవి నా వ్యక్తిగత విలువలతో సరిపోలడం లేదు’ అని రాశారు. రాజీనామాకు ఇతర కారణాలు లేవని తెలిపారు. అనంతరం ఆర్బీఐ అనుమతితో కేకీ మిస్త్రీ తాత్కాలిక పార్ట్ టైమ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌లో ఊహించని నాయకత్వ మార్పు వల్ల ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడడం తో షేర్లు పతనం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి

