Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Heart Problems in Children | చిన్నారుల్లో గుండె సమస్యలు.. లక్షణాలు, కారణాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Heart Problems in Children | చిన్నారుల్లో గుండె సమస్యలు.. లక్షణాలు, కారణాలు

లైఫ్​స్టైల్​

Heart Problems in Children | చిన్నారుల్లో గుండె సమస్యలు.. లక్షణాలు, కారణాలు

ఇటీవల చిన్నారుల్లో గుండెపోట్లు పెరిగాయి. దీంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 28, 2026 6:49 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Heart Problems in Children

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heart Problems in Children | ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు పెరిగాయి. యువత, చిన్నారులు సైతం గుండెపోటుతో చనిపోతున్నారు. పాఠశాలలో ఆడుకుంటూ, పాఠాలు వింటూ గతంలో పలువురు విద్యార్థులు కుప్పకూలారు.

Contents
  • Heart Problems in Children | పుట్టుకతో..
    • Heart Problems in Children | వాపు రావడంతో..
      • లక్షణాలు
      • తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాజస్థాన్‌ (Rajasthan)లో ఇటీవల తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటు (Heart Problems in Children)తో మృతి చెందింది. ఐదో తరగతి చదవుతున్న చిన్నారి పాఠశాల మైదానంలో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే పాఠశాల సిబ్బంది బాలికను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఈ నెల 23న చోటు చేసుకుంది. సదరు బాలిక సోదరుడు సైతం ఇదే విధంగా మరణించడం గమనార్హం. ఇటీవల చిన్నారుల్లో గుండెపోట్లు పెరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో హార్ట్​ ఎటాక్​ కారణాలు, లక్షణాలను వైద్యులు వివరించారు.

Heart Problems in Children | పుట్టుకతో..

పిల్లల్లో గుండె ఒక్కసారిగా ఆగిపోవడం, హృదయ సంబంధ పరిమితుల కారణంగా జబ్బులు రావడం చాలా ప్రమాదకర పరిస్థితిగా వైద్యులు పేర్కొంటున్నారు. దీనిని సడెన్ కార్డియాక్ అరెస్ట్ (SCA) అని పిలుస్తారు. కొందరు పిల్లల్లో పుట్టుకతో గుండె సంబంధ సమస్యలు ఉంటాయి. అయితే వాటి గురించి తల్లిదండ్రులకు తెలియకపోవడంతో పిల్లలు హార్ట్​ఎటాక్​కు గురయ్యే అవకాశం ఉంది. గుండె నాళాల్లో పరిమాణం తప్పుగా ఉండటం వంటివి రక్తప్రవాహాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. గుండె రక్తం పంపింగ్​ చేసే వేగం కొందరిలో ఒక్కోసారి మారిపోతు ఉంటుంది. ఇది కూడా కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతుంది.

Heart Problems in Children | వాపు రావడంతో..

వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్లూ, డెంగీ వంటి వ్యాధులతో గుండె కండరాల్లో వాపు వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు పిల్లల్లో Long QT syndrome, Wolff-Parkinson-White వంటి రోగాలు ఉంటాయి. ఇవి గుండె పనితీరులో మార్పులు తెస్తాయి. అలాగే శరీరానికి గట్టిగ దెబ్బలు తగలడం, ఊపిరితిత్తుల వ్యవస్థలో పెద్ద ఇబ్బంది కూడా హార్ట్​ ఎటాక్​లకు కారణం అవుతాయి. సాధారణంగా పిల్లల్లో సడెన్​ కార్డియాక్​ అరెస్ట్​ అరుదుగా వస్తుంది. అది వస్తే మాత్రం ప్రమాదకరంగా ఉంటుంది.

లక్షణాలు

పిల్లలో సడెన్​ కార్డియాక్​ అరెస్ట్​కు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరం బలహీనంగా ఉంటుంది. వెంటనే అలసిపోతారు. కాళ్లు, చేతుల్లో వాపు వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యులు పలు రకాల పరీక్షలు చేసి గుండె సమస్యలను గుర్తిస్తారు. ఈసీజీ, ఎకో టూడీ, రక్తంలో ఆక్సీజన్​ స్థాయి చెక్​ చేస్తారు. అవసరం అయితే కార్డియాక్​ ఎంఆర్​ఐ, సిటీ స్కాన్​ కూడా చేస్తారు. పిల్లలు గుండెపోటుకు గురైతే వెంటనే సీపీఆర్​ చేయాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Heart Problems in Childrenపిల్లలో గుండె సంబంధ సమస్యలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అప్పుడప్పుడు పిడియాట్రిక్​ చెకప్​లతో పాటు కార్డీయాలజీ పరీక్షలు చేయించాలి. కుటుంబంలో ఎవరికైన గుండె సంబంధ సమస్యలు ఉంటే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం, క్రీడలు, మంచి నిద్రలు హృదయ ఆరోగ్యానికి అవసరం.
– డాక్టర్​ సందీప్​రావు, గుండె వైద్య నిపుణులు

ఇది కూడా చదవండి.. : YouTuber Komali Death | సోషల్ మీడియాతో పాపుల‌ర్‌.. ప్రేమ‌లో విఫ‌లం కావ‌డంతో యువ యూట్యూబర్ కోమలి మృతి

Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు
Snake Hunting Ability | పాములకు చూపు తక్కువే.. కానీ వేటలో కింగ్! ఆ అద్భుత శక్తి ఏంటో తెలుసా?
Soap Scrap Uses | సబ్బు చిన్న ముక్కలు పారేస్తున్నారా.. వీటి లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా!
Home Cleaning Tips | ఇంట్లో వీటిని శుభ్రం చేయడం లేదా.. అయితే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే!
TAGGED:Child Heart AttackHeart Problems in ChildrenLong QT SyndromePediatric Heart HealthSudden Cardiac ArrestWolff-Parkinson-White Syndrome
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Komatpalli Youth Death Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
Next Article Iran Gulf Attacks Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?