అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heat Wave | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు భగభగ మండుతున్నాడు. మధ్యాహ్నం సమయంలో అయితే కాలు బయట పెట్టలేని పరిస్థితి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో నేటి నుంచి హీట్‌వేవ్ మొదలు కానుంది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ అధికారులు (IMD) హెచ్చరించారు. రికార్డు స్థాయిలో టెంపరేచర్ ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 22 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. దీంతో మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు చేయొద్దని, ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
Heat Wave | జాగ్రత్తలు పాటించాలి
ఈ ఎండాకాలం సీజన్ ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురిసిన సమయంలో వాతావరణం కాస్తా చల్లబడింది. అనంతరం మళ్లీ భానుడు భగభగ మండుతున్నాడు. ఉక్కపోతతో కూలర్లు, ఏసీల వినియోగం భారీగా పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ సైతం అధికంగా నమోదు అవుతోంది. ఎండలు మండుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, నీడ పట్టున ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జంక్ ఫుడ్, అల్కాహాల్, దూమపానానికి దూరంగా ఉండాలి.
ఇది చదవండి : Excise Officer Resignation | ఎక్సైజ్ శాఖలో వివాదం.. ఆత్మాభిమానం కోసం డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి గుడ్ బై..
