అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heatwave Alert | భానుడు భగ భగ మండుతున్నాడు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం 9 గంటలకే కాలు బయట పెట్టలేని పరిస్థితి. సాయంత్రం 5 గంటల వరకు కూడా సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు.
ఎండల ధాటికి ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) మరో షాకింగ్ వార్త చెప్పారు. నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. వడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Heatwave Alert | ఏడు రోజుల పాటు
రాష్ట్రంలో రానున్న వారం రోజులలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ (Nizamabad), జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, గద్వాల్ జిల్లాలలో 42-45°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హైదరాబాద్ (Hyderabad)లో 40-42 డిగ్రీలు ఉంటుంది. ఇతర జిల్లాలలో 41-43 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతతో పొడి వాతావరణం ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో వేడి తీవ్రంగా అధికంగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి..: RTC JAC Strike Talks | నేడు లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు.. విఫలమైతే సమ్మెకు వెళ్లే యోచన
