అక్షరటుడే, వెబ్డెస్క్: heavy rain alert | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావారణ శాఖ (IMD) కీలక న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుంది. పలు ప్రాంతాల్లో వడగళ్లు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం వర్షం పడుతుందని అధికారులు తెలిపారు.
heavy rain alert | రైతుల ఆందోళన
వర్షాలు ఉన్నాయని అధికారులు చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. కొందరు పంట కోసి ధాన్యం ఆరబోశారు. మరికొందరు పొలాలు కోయించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో వర్షం పడితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వడగళ్లు కురిస్తే వడ్లు రాలిపోతాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోసారి వానలు పడితే మరింత నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
heavy rain alert | పెరిగిన ఉష్ణోగ్రతలు
మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యల్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లిలో 40-42 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండే అవకాశం ఉంది.
దీనిని కూడా చదవండి : Jeevan Reddy Sabha | జీవన్ రెడ్డి బహిరంగ సభపై ఉత్కంఠ.. కేసీఆర్ హాజరు అవుతారా?
