అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hema Drug Test | రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో డ్రగ్ టెస్టు నిర్వహించగా.. 8 మందికి పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. కాగా.. ఇదే పార్టీకి టాలీవుడ్ సీనియర్ నటి హేమ (Senior Actress Hema) హాజరైంది. అయితే డ్రగ్ టెస్టుకు సంబంధించి వచ్చిన రిజల్ట్‌పై ఆమె వీడియో రిలీజ్ చేసింది.
Hema Drug Test | క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు
టాలీవుడ్ సీనియర్ నటి హేమ అంటే తెలుగు ప్రేక్షకుల్లో దాదాపు తెలియని వాళ్లు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె చాలా మూవీల్లో యాక్ట్ చేసింది. దిగ్గజ కమెడియన్ల సరసన కూడా నటించింది. కాగా.. ఆమె తన డ్రగ్ టెస్ట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో పోస్టు చేసింది.
Hema Drug Test | ముక్కుసూటిగా ఉంటా..
‘‘నేను ఇవాళ పబ్‌కు వచ్చాను.. అక్కడ నా యూరిన్ శాంపిల్ తీసుకున్నారు. నా డ్రగ్ టెస్టు రిజల్ట్ నెగెటివ్ అని వచ్చింది. ఇందులో కనిపించిందా..? నేను మరో వీడియో పోస్టు చేస్తాను.. మీ హేమక్క తప్పు చేయదు. జెన్యూన్‌గా,, ముక్కుసూటిగా ఉంటుంది. లవ్యూ ఆల్’’ అంటూ వీడియోలో డ్రగ్ టెస్టు రిజల్ట్ చూపించింది.
Hema Drug Test | గతంలోనూ ఆరోపణలు..
గతంలో కూడా బెంగళూరులో రేవ్ పార్టీ (Bengaluru Rave Party)లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు బయటకు వచ్చాయి. కానీ ఆమె లైవ్ వీడియో రిలీజ్ చేసింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు. అయితే ఆ కేసులో హేమ పేరును విచారణలో చేర్చి క్లీన్ చీట్ ఇచ్చారు.
Hema Drug Test | కొండాపూర్ పబ్‌లో 8 మందికి పాజిటివ్..
కొండాపూర్‌లోని ఓ పబ్‌లో పార్టీ చేసుకున్న వాళ్లలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ ఘటన కలకలం రేపింది. మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. ఆరుగురికి గంజాయి పాజిటివ్, ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది.
View this post on Instagram
ఇది కూడా చదవండి..: Ramayana Teaser | హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన రామాయణ టీజర్.. ఆకట్టుకుంటున్న వీఎఫ్ఎక్స్
