అక్షరటుడే, వెబ్‌డెస్క్: High Protein Breakfast | చాలామంది ప్రొటీన్ అనగానే వెంటనే గుడ్లు లేదా మాంసాహారం గురించే ఆలోచిస్తుంటారు. కానీ మన భారతీయ వంటింట్లో లభించే పప్పు ధాన్యాలు, పనీర్ వంటి పదార్థాల్లో గుడ్ల కంటే మెరుగైన ప్రొటీన్ లభిస్తుందన్న విషయం తెలుసా?
పోషకాహార నిపుణుల ప్రకారం, ఒక సగటు వయోజనుడికి తన శరీర బరువులో ప్రతి కిలోకు సుమారు 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము ప్రొటీన్ అవసరమవుతుంది. అంటే 60-70 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు కనీసం 50 గ్రాముల ప్రొటీన్ అందాలి. శరీరానికి కావాల్సిన ఆ ప్రొటీన్ లోటును భర్తీ చేసే అద్భుతమైన శాఖాహార అల్పాహారాలు ఇక్కడ ఉన్నాయి.
High Protein Breakfast | ప్రొటీన్ పుష్కలంగా ఉండే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌లు :
పెసరపప్పు చిల్లా: నానబెట్టిన పెసరపప్పును అల్లం, పచ్చిమిర్చితో కలిపి రుబ్బి అట్లుగా వేసుకుంటే శరీరానికి మంచి ప్రొటీన్ అందుతుంది. దీనిని మరింత పోషకవంతంగా మార్చడానికి క్యారెట్ లేదా పాలకూర తురుమును జోడించవచ్చు.
పనీర్ భుర్జీ – మల్టీగ్రెయిన్ రోటీ: పనీర్ అనేది శాఖాహారులకు ప్రొటీన్ పవర్‌హౌస్ లాంటిది. పనీర్ భుర్జీని మల్టీగ్రెయిన్ రొట్టెతో కలిపి తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి.
సత్తు పరాటా: వేయించిన శనగ పిండితో (సత్తు) చేసే ఈ పరాటా బీహార్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది శరీరానికి కావాల్సిన ప్రొటీన్ తో పాటు, రోజంతా కడుపు నిండుగా ఉండేలా చేసే ఫైబర్‌ను కూడా అందిస్తుంది.
High Protein Breakfast |
శనగపిండి చిల్లా: తక్కువ సమయంలో తయారయ్యే ఈ చిల్లాలో కొద్దిగా పెరుగు కలిపితే అది మెత్తగా ఉండటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మొలకెత్తిన గింజల సలాడ్: పెసలు, శనగలు వంటి మొలకలను ఆవిరిపై లైట్‌గా ఉడికించి, నిమ్మరసం, చాట్ మసాలాతో తీసుకుంటే నేరుగా శరీరానికి శక్తి అందుతుంది.
అడ్డై దోస: వివిధ రకాల పప్పు దినుసులను (కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు) కలిపి చేసే ఈ దోస ప్రొటీన్, ఫైబర్‌కు కేరాఫ్ అడ్రస్.
హంగ్ కర్డ్ పార్ఫైట్: గడ్డ పెరుగును వడకట్టి, అందులో బాదం, వాల్‌నట్స్, తాజా పండ్లను కలుపుకొని తీసుకుంటే అది శరీరానికి చలవను ఇవ్వడంతో పాటు ప్రొటీన్‌ను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా!

