అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. ఆమెపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
బంజారాహిల్స్ (Banjara Hills)లోని సబ్యసాచి స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుమిత హిందూ దేవతలను అవమానించేలా పోస్టులు చేసింది. శ్రీరాముడు, గణేశుడు, ఆంజనేయుడిపై అసభ్యకర పోస్టులు పెట్టింది. ఆమెపై హిందవులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసు (Gachibowli Police)లకు హిందూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీశారంటూ పేర్కొన్నారు. సుమితపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Hindu Deity Disrespect | కేసు నమోదు
హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు సుమితపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. నెటిజన్లు సైతం సుమితపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని కఠినంగా శిక్షించానలి కామెంట్లు చేస్తున్నారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆమె పని చేస్తున్న స్టోర్‌కు వచ్చి ఆందోళన చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Shamshabad Rolex Seizure | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా రోలెక్స్ వాచీలు పట్టివేత
