అక్షరటుడే, గాంధారి: Hindu Sammelan Gandhari | కులభేదాలు లేని హిందూ సమాజమే (Hindu Sammelan) లక్ష్యంగా ముందుకు సాగాలని బిచ్కుంద సోమాయప్ప సద్గురు స్వామీజీ అన్నారు. మండల కేంద్రంలో (Gandhari event) శుక్రవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. దీంట్లో భాగంగా మొదట దుర్గా నగర్ చెక్పోస్ట్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Hindu Sammelan Gandhari | సమ్మేళనం నిర్వహించడం అభినందనీయం..
ఈ సందర్భంగా సద్గురు సోమాయప్ప స్వామీజీ మాట్లాడుతూ హిందూ సమ్మేళనం నిర్వహించడం (caste free society) అభినందనీయమన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించి హిందువులంతా సంఘటితం కావాలన్నారు. హిందూ ధర్మపరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, వేగంగా మార్పు చెందుతున్న సమాజంలో జీవిత విలువలను (Telangana news) కాపాడుకోవాలని సూచించారు. మరో అతిథి ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒకరిలో దైవభక్తిని పెంపొందించుకోవాలని, హిందూ సంప్రదాయాలను పాటించాలని సూచించారు. హిందూ ధర్మంలో తల్లికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.
ఆర్ఎస్ఎస్ (RSS Indur) ఇందూర్ విభాగ్ కార్యవహ రాజులవార్ దిగంబర్ మాట్లాడుతూ.. భారతదేశంలో హిందూ (cultural event India) సామ్రాజ్యాన్ని ఎందరో కూలదోయాలని చూశారని, ఎన్ని కుతంత్రాలు చేసినా భారతదేశాన్ని ఏమీ చేయలేకపోయారన్నారు. మన హిందూ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉందని ఉద్ఘాటించారు. కార్యక్రమ ప్రారంభంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల గీతాలాపన అలరించాయి. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రావు సాహెబ్ రావు, అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, సిద్ధి రాములు, కృష్ణ గౌడ్, శంకర్రావు, దిలీప్ రావు, రవీందర్ గౌడ్, లక్ష్మణరావు, రాజు, భూపతి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ
