అక్షరటుడే, వెబ్‌డెస్క్: Home Cleaning Tips | మనం ప్రతిరోజు ఇంటిని తుడుస్తూ, వస్తువులను సర్దుకుంటూ ఇల్లు చాలా శుభ్రంగా ఉందని అనుకుంటాం. అయితే, మన కంటికి కనిపించని కొన్ని ప్రదేశాల్లో, వస్తువులపై దుమ్ము, ధూళి భయంకరంగా పేరుకుపోతుంటాయి.
వీటిని మనం రోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే శుభ్రం చేయడం వల్ల అవి బ్యాక్టీరియాకు నిలయాలుగా మారుతున్నాయి. ఫలితంగా శ్వాసకోస ఇబ్బందులు, చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఏ వస్తువులను ఎంత కాలానికి ఒకసారి శుభ్రం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Home Cleaning Tips | గోడలు, కిటికీలు:
చాలామంది నేలను రోజూ తుడుస్తారు కానీ, గోడల గురించి పట్టించుకోరు. గోడలపై పేరుకుపోయే సన్నని ధూళి వల్ల గాలి కలుషితం అవుతుంది. అందుకే కనీసం వారానికి ఒకసారి గోడలను దులపడం అలవాటు చేసుకోవాలి. ఇక కిటికీల విషయానికొస్తే, చాలామంది పండుగలకు మాత్రమే వాటిని తుడుస్తుంటారు. కానీ, బయటి నుంచి వచ్చే గాలి కిటికీల ద్వారానే వస్తుంది కాబట్టి, నెలకు ఒకసారైనా వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి.
Home Cleaning Tips | టాయిలెట్:
బాత్‌రూమ్ అనేది బ్యాక్టీరియా త్వరగా వ్యాపించే ప్రదేశం. టాయిలెట్ సీట్లు, సింక్‌లను కనీసం వారానికి ఒకసారి యాంటీ సెప్టిక్ లిక్విడ్స్‌తో కడగాలి. షవర్లు, బాత్‌టబ్‌లను మాత్రం రెండు నుంచి మూడు వారాల వ్యవధిలో క్లీన్ చేసినా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.
Home Cleaning Tips | పరుపు , బెడ్ షీట్లు:
మనం బెడ్ షీట్లను, పిల్లో కవర్లను తరచుగా మారుస్తుంటాం కానీ పరుపు (Mattress) గురించి అశ్రద్ధ చేస్తాం. పరుపుపై చర్మం నుంచి రాలే మృతకణాలు పేరుకుపోతాయి. అందుకే కనీసం రెండు నెలలకు ఒకసారి పరుపుపై కొంచెం బేకింగ్ సోడా చల్లి, కాసేపు ఆగి వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. ఇది దుర్వాసనను పోగొట్టి పరుపును తాజాగా ఉంచుతుంది.
కార్పెట్ల శుభ్రత:
కార్పెట్లు చూడటానికి బాగున్నా, వాటి పోగుల మధ్య దుమ్ము అతుక్కుపోయి ఉంటుంది. కేవలం ఎండలో వేయడం వల్ల మురికి పోదు. నెలకోసారి సాధారణ క్లీనింగ్ చేస్తూనే, ఆరు నెలలకు ఒకసారి స్టీమింగ్ చేయించడం ఉత్తమం. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కార్పెట్ శుభ్రత విషయంలో అస్సలు రాజీ పడకూడదు.
టవల్స్, కీబోర్డ్:
బాత్ టవల్స్‌ను వారానికి ఒకసారి ఉతకడం సరైన పద్ధతి కాదు. చర్మంపై ఉండే మృతకణాలు టవల్‌కు అంటుకోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి మూడు సార్లు వాడిన వెంటనే టవల్‌ను ఉతికేయాలి. అలాగే, మనం నిత్యం వాడే కంప్యూటర్ కీబోర్డ్, మౌస్‌లపై టాయిలెట్ సీటు కంటే ఐదు రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. కాబట్టి వారానికి ఒకసారి వీటిని జాగ్రత్తగా తుడుచుకోవడం ఎంతో ముఖ్యం.
ఇది కూడా చదవండి: Eyes Liver Warning | కళ్లు ఇచ్చే డేంజర్ సిగ్నల్స్.. ఈ మార్పును నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు!

