అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hormuz Indian Death | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా– ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసేసింది. దీంతో అనేక నౌకలు అక్కడ చిక్కుకున్నాయి. అందులో భారత్‌కు చెందిన షిప్‌లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఓ షిప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారతీయుడు మృతి చెందాడు.
హార్మూజ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఓ భారతీయుడు గుండెపోటుతు చనిపోయారు. చమురుతో భారత్‌కు వస్తున్న ‘అవానా’ చమురు నౌకకు ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన రాకేశ్ రంజన్ (43) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో భారత్‌కు చెందిన 20 నౌకలు హార్ముజ్ జలసంధి సమీపంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అవానా నౌక కూడా జలసంధికి 14 నాటికన్ మైళ్ల దూరంలో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో షిప్ కెప్టెన్ రాకేశ్ గుండెపోటుకు గురై మృతి చెందారు.
Hormuz Indian Death | కేంద్రానికి విజ్ఞప్తి
రాకేశ్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నెల 18న ఆయన కుప్పకూలిపోయాడు. వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. ఉద్రిక్తతల నేపథ్యంలో విమానంలో అతడిని తరలించేందుకు అనుమతులు రాలేదు. దీంతో షిప్లో దుబాయ్ (Dubai)లోని పోర్ట్ రషీద్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాకేశ్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren)కు లేఖ రాసినట్లు మృతుడి సోదరుడు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Middle East Oil Loss | ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్ ఆయిల్ ధ్వంసం.. నష్టం ఎంతంటే!

