అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hormuz Strait blockade | ఇరాన్, అమెరికా మధ్య సీజ్ఫైర్ (Ceasefire) అమలులోకి వచ్చినా హర్ముజ్ జలసంధిపై ప్రతిష్టంభన తొలగడం లేదు. ఇరాన్ ఇంకా పూర్తిస్థాయిలో జలసంధిని తెరవలేదు. ఈ క్రమంలో యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.
హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి, దాని నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించే అన్ని నౌకలను తమ దేశ నౌకాదళం దిగ్బంధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్థాన్ (pakistan)లో అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగిన చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ ప్రకటన వెలువడింది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం రవాణాకు అయ్యే ఈ జలమార్గంపై నియంత్రణను సాధించాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే ఇరాన్ జలసంధిని ఆధీనంలోకి తీసుకొని నౌకల రాకపోకలను అడ్డుకుంది.
Hormuz Strait blockade | ప్రపంచ దోపిడీ
సీజ్ఫైర్ సమయంలో హర్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా ఆదేశించింది. అయితే ఇరాన్ (Iran) ఆ నిర్ణయానికి కట్టుబడి లేదని ట్రంప్ పేర్కొన్నారు. దీంతోనే చర్చలు విఫలం అయ్యాయని తెలిపారు. జలసంధిని ఇరాన్ మూసివేయడాన్ని ట్రంప్ “ప్రపంచ దోపిడీ”గా అభివర్ణించారు. ఇరాన్‌కు చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే ఏ ఒక్కరికీ బహిరంగ సముద్రంలో సురక్షిత ప్రయాణం లభించదని ఆయన అన్నారు.
Hormuz Strait blockade | ఆ నౌకలను అడ్డుకుంటాం
ప్రస్తుతం ఇరాన్ కొన్ని నౌకలను హర్ముజ్ నుంచి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ మార్గంలో వెళ్లడానికి టోల్ వసూలు చేస్తోంది. దీనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెతికి, అడ్డుకోవాలని తాను నౌకాదళాన్ని ఆదేశించానని చెప్పారు. చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే ఏ ఒక్కరికీ బహిరంగ సముద్రంలో సురక్షిత ప్రయాణం లభించదన్నారు. సరైన సమయంలో ఇరాన్‌ను ముగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని కూడా ట్రంప్ అన్నారు.
ఇది కూడా చదవండి : Hormuz Sea Mines | హర్ముజ్‌లో మరో సమస్య.. సీమైన్స్ ఎక్కడున్నాయో తెలియదంటున్న ఇరాన్
