Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hormuz Strait India | భారత్​కు ఊరట.. ‘హార్ముజ్’ ద్వారా రవాణాకు అనుమతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Hormuz Strait India | భారత్​కు ఊరట.. ‘హార్ముజ్’ ద్వారా రవాణాకు అనుమతి

అంతర్జాతీయం

Hormuz Strait India | భారత్​కు ఊరట.. ‘హార్ముజ్’ ద్వారా రవాణాకు అనుమతి

హార్ముజ్​ జలసంధి ద్వారా భారత్​కు వచ్చే నౌకల రవాణాకు ఇరాన్​ అంగీకరించింది. ఈ మేరకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 11:17 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Hormuz Strait India

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hormuz Strait India |భారత్​కు ఇరాన్​ ఊరటనిచ్చింది. హార్ముజ్​ జలసంధి (Strait of Hormuz) ద్వారా భారత్​కు వచ్చే నౌకల రవాణాకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. భారత్ జెండాలతో వచ్చే నౌకలను అనుమతించనున్నట్లు పేర్కొంది.

Contents
  • Hormuz Strait India | ఆ దేశాలపై ఆంక్షలు
    • Hormuz Strait India | కీలక మార్గం

పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో ఇరాన్​ హార్ముజ్​ జలసంధిని మూసి వేసిన విషయం తెలిసిందే. ఆ మార్గంలో నౌకల రాకపోకలను ఇరాన్​ అడ్డుకుంటుంది. దీంతో చమురు, గ్యాస్​ సరఫరా నిలిచి అనేక దేశాల్లో సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs of India) రంగంలోకి దిగింది. ఇరాన్​తో చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావడంతో భారత జెండాలతో ఉన్న నౌకలను అనుమతించాలని ఆ దేశం నిర్ణయించింది. ఇప్పటికే భారత్‌కు చెందిన రెండు చమురు ట్యాంకర్‌లు హార్ముజ్​ జలసంధిని దాటి వచ్చాయి. అందులో ఒకటి బుధవారం ముంబైని చేరుకుంది.

Hormuz Strait India | ఆ దేశాలపై ఆంక్షలు

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar), ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత నౌకల రవాణాలకు అనమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. రెండు భారతీయ చమురు ట్యాంకర్లు పుష్కర్, పరిమల్ హార్ముజ్ జలసంధి మీదుగా సురక్షితంగా వెళ్లాయి. అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ నుంచి చమురు ట్యాంకర్ల ప్రయాణానికి ఆంక్షలు అమలులో ఉన్నాయి.

Hormuz Strait India

Hormuz Strait India | కీలక మార్గం

ఇరాన్ తీరానికి ఆనుకుని ఉన్న హార్ముజ్​ జలసంధి ద్వారా దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అవుతుంది. ప్రపంచంలోని చమురు వినియోగంలో ఇది ఐదో వంతు. దీంతో ఈ మార్గం ఎంతో కీలకం. దీనిని ఇరాన్​ మూసివేయడంతో చాలా దేశాల్లో ఆయిల్​, గ్యాస్​ కొరత నెలకొంది. దీంతో క్రూడ్​ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా పలు దేశాలు పెట్రోలు, డీజిల్​, గ్యాస్​ ధరలను పెంచాయి.

ఇది కూడా చదవండి..: Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన ప్రకటన

Pakistan Fuel Crisis | ఉద్యోగుల జీతాల్లో కోత.. పాఠశాలలకు సెలవులు.. పాక్​ కీలక నిర్ణయాలు
Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
Iran Destroys THAAD Radar | యూఎస్ డిఫెన్స్​ సిస్టంను ధ్వంసం చేసిన ఇరాన్​
Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్​ వార్నింగ్​
Padma River Bus Accident | ఘోర విషాదం.. పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం!
TAGGED:Hormuz Strait IndiaMinistry of External Affairs of IndiaS JaishankarStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran War Ceasefire Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన ప్రకటన
Next Article Gas Cylinder Queues Gas Cylinder Queues | సిలిండర్ల కోసం బారులు.. ఏజెన్సీల వద్ద పోలీసు భద్రత
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?