అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hormuz Strait | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ జలసంధిని తెరవకపోతే దాడులు తప్పవని హెచ్చరించారు.
అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. హర్ముజ్ జలసంధిని తెరవాలనే షరతుతో అమెరికా సీజ్‌ఫైర్‌కు ఓకే చెప్పింది. ఇరాన్ సైతం దీనికి అంగీకరించింది. అయితే ఇరాన్ పది షరతులు పెట్టింది. అందులో లెబనాన్‌పై దాడులు చేయొద్దని పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ (Israel and Lebanon)పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసి వేస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేని నౌకలు హర్ముజ్ దాటడానికి ప్రయత్నిస్తే ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
Hormuz Strait | ఒప్పందం ఉల్లంఘిస్తే దాడులు
హర్ముజ్‌ను తెరవకపోతే దాడులు తప్పవని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఎప్పుడూ లేని విధంగా ఇరాన్‌పై దాడులు చేస్తామన్నారు. ఇప్పటికే ఇరాన్ చుట్టూ తమ దళాలు మోహరించి ఉన్నాయని చెప్పారు. ఒప్పందం ఉల్లంఘిస్తే దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డీల్ అమలయ్యే దాకా అమెరికా సైన్యం అక్కడే ఉంటుందన్నారు. ఇరాన్ (Iran) దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు ఉండొద్దని, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు.
Hormuz Strait | లెబనాన్‌కు వర్తించదు
కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Israel PM Netanyahu) అన్నారు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడిందని పేర్కొన్నారు. తమకు ట్రంప్‌తో సంబంధాలు బలంగా ఉన్నాయన్ని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి సహకారం మరువలేనిదని తెలిపారు. మా వేలు ట్రిగ్గర్‌పై సిద్ధంగా ఉందని నెతన్యాహు అన్నారు.
ఇది కూడా చదవండి..: Trump Tariffs | మరోసారి షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ దేశాలపై 50 శాతం టారిఫ్‌లు
