Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hormuz Strait Tension | హర్మూజ్‌కు అమెరికా బలగాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Hormuz Strait Tension | హర్మూజ్‌కు అమెరికా బలగాలు..

అంతర్జాతీయం

Hormuz Strait Tension | హర్మూజ్‌కు అమెరికా బలగాలు..

హర్ముజ్​ జలసంధి సమీపంలోకి అమెరికా భారీగా బలగాలను పంపించింది. దీంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 3:56 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Hormuz Strait Tension

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hormuz Strait Tension | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్ హర్ముజ్​ జలసంధిని (Strait of Hormuz) మూసి వేయడంతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో అమెరికా భారీగా బలగాలను జలసంధి సమీపంలోకి పంపడం గమనార్హం.

హర్ముజ్​ జలసంధిని 48 గంటల్లో తెరవాలని ట్రంప్​ (Donald Trump) ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. లేదంటే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ట్రంప్​కు ఇరాన్​ కౌంటర్​ ఇచ్చింది. తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. ఈ క్రమంలో జలసంధి వద్దకు భారీగా సెయిలర్లు, మెరైన్లను అమెరికా పంపించింది.

Hormuz Strait Tension | 5 వేల బలగాలు

హర్మూజ్‌ భద్రతతో పాటు.. ఇరాన్‌ చమురు (Iranian Oil) మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసమే దాదాపు 5 వేల మంది బలగాలను పంపించినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై ఇరాన్‌ సైతం స్పందించింది. భూ ఆక్రమణకు ప్రయత్నిస్తే పర్షియన్‌ గల్ఫ్‌లో మరిన్ని సీ మైన్స్‌ను పెడతామని వార్నింగ్​ ఇచ్చింది.హర్ముజ్​ జలసంధిని పూర్తిగా మూసి వేయలేదని ఇరాన్​ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్‌కు (Israel) సంబంధించిన నౌకలు మినహా మిగిలిన నౌకలు ప్రస్తుతం భద్రతా, రక్షణ నిబంధనలకు లోబడి ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే తాజాగా అమెరికా బలగాలను పంపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇది కూడా చదవండి..: Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు

Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
Iran Currency Collapse | ఏడున్నర డాలర్లుంటే.. అక్కడ కోటీశ్వరులే!
Iran US tensions | అమెరికాకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే దానిని శాశ్వతంగా మూసివేస్తాం
US Iran Conflict | ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తాం : అమెరికా
Hormuz Indian Ships | ఇరాన్​ గుడ్​న్యూస్​.. హర్ముజ్​ నుంచి భారత నౌకలకు అనుమతి
TAGGED:Donald TrumpHormuz Strait TensionIranian OilIsraelStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Youth Job Promises Youth Job Promises | కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది..
Next Article SSC Exam Rules SSC Exam Rules | ఎస్సెస్సీ పరీక్షల్లో నిర్లక్ష్యం చేస్తే.. సస్పెన్షన్​ కంటే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?