అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hormuz Strait Ultimatum | పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల గడువు విధిస్తూ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ (Strait of Hormuz) మూసివేతతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ జలసంధి ద్వారా ప్రపంచ ఇంధన సరఫరాలో పెద్ద భాగం జరుగుతుండటంతో, దీనిని మూసివేయడంతో అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత తీవ్రంగా పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలని ఇరాన్‌కు గట్టి అల్టిమేటం జారీ చేశారు.
Hormuz Strait Ultimatum | ట్రంప్ హెచ్చరికలు..
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ (Truth Social) చేసిన పోస్టులో, “హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలి. ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదు. లేకపోతే ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తాం” అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా, అవసరమైతే ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాన్ని ముందుగా లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా తమ యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి తరలిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
Hormuz Strait Ultimatum | ఇంధన కొరత
ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా చైన్ తీవ్రంగా ప్రభావితమైంది. అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటూ ఆర్థిక ఒత్తిడిని అనుభవిస్తున్నాయి. చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయం కలగడం వంటి సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా, హర్ముజ్ జలసంధి అంశం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో (Politics) కీలకంగా మారింది.
దీనిని కూడా చదవండి : UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం.. బ్రహ్మోస్, ఆకాశ్ కొనుగోలుకు యూఏఈ ఆసక్తి!

