అక్షరటుడే, కామారెడ్డి: House Fire Accident | ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధమైంది. ఈ ఘటన సదాశివనగర్ (Sadashivanagar News) మండలం తిర్మన్ పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
House Fire Accident | ఒక్కసారిగా లేచిన మంటలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సున్నపు రాజుకు చెందిన ఇంట్లో గురువారం మధ్యాహ్నం (House Fire Accident) ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు (Kamareddy Fire Incident) సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలు, మరొక వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అగ్నిమాపక శకటాన్ని (Telangana Fire Accident) రప్పించి గ్రామస్థుల సహకారంతో చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
కాలిబూడిదైన సామాగ్రి
ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పోలీసులు (Kamareddy) ఊపిరి పీల్చుకున్నారు. ఇంటి పైకప్పు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో (Local News Kamareddy) ఇంట్లో ఉన్న సామాగ్రి కాలిబూడిదయ్యాయి. ఇంట్లో దాచిన 20 తులాల బంగారు ఆభరణాలు కాలి ముద్దగా మారాయి. వెండి కూడా ఒకచోట ముద్దలుగా మారిపోయింది. రెండు తులాల గుండ్లు, మరొక 10 తులాల వెండి లభించడం లేదని బాధితులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంట్లో మంటలకు అన్నీ కాలిపోయినా పూజ గదిలో ఉన్న సత్యనారాయణ స్వామి విగ్రహం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండడం గమనార్హం.

ఇది కూడా చదవండి : Stock Market Fall | కొనసాగుతున్న పతనం.. బేర్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్లు

