అక్షరటుడే, ఆర్మూర్: HPV vaccine awareness | హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అపోహలొద్దని.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 14 ఏళ్ల అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ (HPV vaccine) అందజేస్తుందని ఈఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని (Armoor news) అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (Allu Arjun Fans Association) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ కరపత్రాలను ఆయన ఆదివారం ఆవిష్కరించారు.
HPV vaccine awareness | అల్లుఅర్జున్ ఫ్యాన్స్ సేవలు అభినందనీయం..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ (HPV vaccination) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదన్నారు. బాలికలు తప్పనిసరిగా ఈ వ్యాక్సినేషన్‌ను వేసుకోవాలని ఈ వ్యాక్సిన్ వల్ల మహిళలు గర్భాశయ ముఖ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు.
మహిళలు ఎటువంటి అపోహలు (vaccine awareness) పెట్టుకోకుండా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్, ఈ ఆర్ ఫౌండేషన్ తరపున కోరారు. కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైస్‌ప్రెసిడెంట్ సజ్జ సాయికుమార్, జనరల్ సెక్రెటరీ సాయికుమార్, సెక్రెటరీ వంశీ, సభ్యులు, స్ఫూర్తి సేవాసొసైటీ అధ్యక్షుడు రాస ఆనంద్, ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, అర్గుల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Ravi Bishnoi | బిష్ణోయ్ మాయాజాలం.. రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నాడుగా..
