అక్షరటుడే, ఇందూరు: HPV Vaccine Girls | గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధించేందుకు (hpv vaccine india) ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికలకు (Girls vaccination drive) తప్పనిసరిగా ఇప్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో బోర్గా(పి) జడ్పీహెచ్ఎస్ విద్యార్థినులకు వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
HPV Vaccine Girls | 14 నుంచి 15 ఏళ్ల మధ్య బాలికలకు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 14 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు కలిగిన బాలికలు అందరికీ కచ్చితంగా వాక్సిన్ ఇప్పించాలన్నారు. ఇది ఎంతో ఉపయోగకరమైనదని, దీన్ని తీసుకోవడం వల్ల 95శాతం వరకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను నిరోధించవచ్చన్నారు. వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని తెలిపారు. జిల్లాలో 12,363 మంది బాలికలు ఉన్నారని, వారందరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఇప్పటివరకు కేవలం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉండేదని, సర్వైకల్ క్యాన్సర్‌ను నిర్మూలించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు.
HPV Vaccine Girls | జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో..
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు డిచ్పల్లి, ధర్పల్లి, నవీపేట్, వర్ని, మోర్తాడ్ బాల్కొండ, ఆర్మూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (hpv vaccine india) కూడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో శారీరక (women health india) బలహీనత వల్ల కొంతమందికి అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చని, అయితే ఏమాత్రం భయపడకుండా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..
అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women’s Day) పురస్కరించుకొని బాలికలతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు, డీపీహెచ్ఎస్ శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy Father Remanded | ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్

