Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి

తెలంగాణతాజా వార్తలు

Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి

తాను బతికుండగా హుజురాబాద్​లో డంపింగ్​యార్డు పెట్టనివ్వనని ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 3:46 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Huzurabad Dumping Yard

అక్షరటుడే, వెబ్​డెస్క్: Huzurabad Dumping Yard | తాను బతికుండగా నియోజకవర్గంలోని సిర్సపల్లిలో డంపింగ్​యార్డు (Dumping Yard) పెట్టనివ్వనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి అన్నారు. ఎంతటి పోరాటానికి సిద్ధమని, ప్రభుత్వ వెంటనే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Contents
  • Huzurabad Dumping Yard | నన్ను ఉరితీయండి
    • Huzurabad Dumping Yard | దీక్ష చేస్తా

హుజురాబాద్​​లోని సిర్సపల్లి (Sirsapalli) సమీపంలోని డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం కౌశిక్​రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకులతో కలిసి పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటయితే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మహిళలు పిల్లలు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ప్రజలు డంపింగ్ యార్డ్ వద్దని కోరుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి డంపింగ్ యార్డ్ వద్దని, హుజురాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని దండం పెట్టి చెప్పానని తెలిపారు.

Huzurabad Dumping Yard

Huzurabad Dumping Yard | నన్ను ఉరితీయండి

‘నాపై కోపం ఉంటే ఉరి తీయండి.. జైలుకు పంపండి..’’ కానీ తన నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కౌశిక్​రెడ్డి (Kaushik Reddy) కోరారు. స్వయంగా ముఖ్యమంత్రి డంపింగ్ యార్డ్​ను ప్రతిపాదించారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తాను ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు లేఖ రాశానని చెప్పారు.

Huzurabad Dumping Yard | దీక్ష చేస్తా

డంపింగ్ యార్డ్​ హుజురాబాద్ ప్రజలందరి జీవన్మరణ సమస్య అని ఎమ్మెల్యే అన్నారు. ఒకవేళ ప్రభుత్వం ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే తాను ఈ నెల 7, 8 తేదీలలో స్వయంగా జేఏసీ శిబిరంలో దీక్షలో పాల్గొంటానని తెలిపారు. ఆ లోపే ప్రభుత్వం నుండి అనుకూలమైన ప్రకటన వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. డంపింగ్​యార్డుకు వ్యతిరేకంగా ఈ నెల 3న హుజురాబాద్ బంద్​కు పిలుపునిచ్చామని చెప్పారు. బంద్​ను విజయవంతం చేయాలని కోరారు. అత్యవసర సేవలైన ఆస్పత్రులు, మెడికల్ షాపులు తప్ప మిగతావి అన్ని బంద్ పాటించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన

Ugadi Pachadi | షడ్​ రుచులు.. ఆరు భావాలు.. ఉగాది పచ్చడి మన జీవితానికి ఇచ్చే సందేశం ఇదే!
Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్​
SC Categorization Support | మాదిగల డిమాండ్​లో న్యాయం ఉంది : సీఎం రేవంత్​రెడ్డి
Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
TAGGED:Civic AwarenessDumping YardEnvironmental SafetyHuzurabad Dumping YardKaushik Reddylocal newspublic protestSirsapalliTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Lingampet Society Accounts | Lingampet Society Accounts | లింగంపేట సొసైటీ లెక్కలను బహిర్గతం చేయాల్సిందే..
Next Article Palle Pragathi Participation Palle Pragathi Participation | పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?