అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Bomb Threat | హైదరాబాద్ నగరంలోని ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. 14 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు దుండగులు మెయిల్ పంపారు. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.
బేగంపేటలో గల వాతావారణ శాఖ (IMD) ఆఫీస్లో బాంబులు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉద్యోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబు స్క్వాడ్ సహాయంతో ప్రతి గదిలో తనిఖీలు చేశారు. అయితే వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు.
Hyderabad Bomb Threat | నిత్యం బెదిరింపులు
తెలంగాణ (Telangana) తో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు నిత్యం బాంబు బెదిరింపులు వస్తున్నాయి. రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టులు, పాఠశాలలు, కోర్టులను లక్ష్యంగా చేసుకొని దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇందులో చాలా వరకు నకిలీ బెదిరింపులు ఉంటున్నాయి. ఆకతాయిలు ఈ పని చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకుందామంటే.. చాలా మెయిల్స్ విదేశాల సర్వర్ల నుంచి వస్తున్నాయి. దీంతో నకిలీ బాంబు బెదిరింపులను పోలీసులు అరికట్టలేకపోతున్నారు.
Hyderabad Bomb Threat | పోలీసుల దర్యాప్తు
ఐఎండీ కార్యాలయం (IMD Office) లో సోదాలు చేపట్టిన పోలీసులు ఈ బెదిరింపులు ఆకతాయిలా? లేక ఏదైనా ఉగ్రవాద సంస్థనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు (Cybercrime police) విచారణ చేపట్టారు. కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని పాలు పాఠశాలల్లో సైతం బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ పంపారు. నిత్యం బెదిరింపులు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అధికారుల సమయం వృథా అవుతోంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Building Collapse | హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు దుర్మరణం

