అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Car Accident | హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి (Mailardevpalli)లో కారు బీభత్సం సృష్టించింది. ఓ స్కోడా కారు బైక్‌ను ఢీకొని రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది.
రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్కోడా కారు ఒక బైక్‌ను ఢీకొట్టి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. పల్లెచెరువు నుంచి చంద్రాయణగుట్ట వైపు వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు, అతను మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Car Accident | నల్గొండ జిల్లాలో..
నల్గొండ పట్టణంలోని ఉడిపి హోటల్ వద్ద ఆదివారం అర్ధరాత్రి కారు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి స్కూటీని, పారిశుధ్య కార్మికులను కారు ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఇద్దరికి, మరో ఇద్దరు పారిశుధ్య కార్మికులకు గాయాలు అయ్యాయి. నల్గొండ-హైదరాబాద్ రోడ్డు (Nalgonda-Hyderabad Road)లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారిని ఢీకొన్న అనంతరం కారు రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను ఢీకొని బోల్తా పడింది. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad Car Accident | అతివేగంతో..
రాష్ట్రంలో ఇటీవల కారు ప్రమాదాలు పెరిగాయి. ముఖ్యంగా పలువురు యువకులు అతివేగంగా కార్లను నడుపుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది మద్యం తాగి నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ.. సామాన్యుల ప్రాణాలతో ఆటలు అడుతున్నారు. కార్లలో ఉన్న వారు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Kavitha Slams Revanth | సీఎం రేవంత్‌రెడ్డిపై కవిత ఆగ్రహం

