అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Drug Bust | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్, గంజాయి దందా ఆగడం లేదు. పోలీసులు దాడులు చేస్తున్న నిందితులు విక్రయాలు సాగిస్తున్నారు. విద్యార్థులు, యువత వీటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. టాస్క్‌పోర్స్ (Taskforce), సనత్‌నగర్ (Sanath Nagar) పోలీసులతో కలిసి దాడులు చేపట్టారు. ఇద్దరు మైనర్లు, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 60 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad Drug Bust | పరారీలో ప్రధాన నిందితులు
హేమంత్ (23), నాగేంద్ర (21) అనే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నగరంలో తెలిసిన కస్టమర్లకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సాయి నిఖిల్ యాదవ్, ఆదిత్య అనే ఇద్దరు కీలక సరఫరాదారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం పోలీసులకు చిక్కిన నిందితులు మద్యం, గంజాయి, MDMAకు బానిసలు అయ్యారు. చింతల్‌లోని సరఫరాదారులతో పరిచయాలు పెంచుకుని తక్కువ ధరలకు MDMAను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అనంతరం దానిని ఎక్కువ ధరకు కస్టమర్లకు విక్రయిస్తున్నారు.
Hyderabad Drug Bust | గంజాయి స్వాధీనం
హైదరాబాద్‌లో సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ సమీపంలో 10.16 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా నగరంలో ఇటీవల గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. పలువురు మొదట ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. అనంతరం డబ్బుల కోసం దందాలోకి దిగుతున్నారు. యువత, విద్యార్థులు వీటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
దీనిని చదవండి : Cyber Fraud | మాజీ ప్రొఫెసర్‌కు సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.కోటి స్వాహా

