అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Drug Tests | హైదరాబాద్ నగరంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. అలాగే రౌడీ షీటర్లు సైతం ఇటీవల రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు కీలక ఆపరేషన్ చేపట్టారు. నగరంలోని రౌడీషీటర్లను డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో 1300 మంది రౌడీషీటర్లను పోలీసులు గుర్తించారు. వారిలో 250 మందికి డ్రగ్స్ పరీక్షలు (Drug Tests) చేయగా.. 190 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరు గంజాయికి అలవాటు పడ్డట్లు పోలీసులు గుర్తించారు. అయితే రౌడీ షీటర్లకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Hyderabad Drug Tests | డ్రగ్స్ నియంత్రణ కోసం..
నగరంలో డ్రగ్స్, గంజాయి దందా జోరుగా సాగుతోంది. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం ఈగల్ టీమ్ (Eagle Team) ఏర్పాటు చేసింది. ఈగల్ టీమ్ పోలీసులు, నార్కోటిక్స్, ఎస్వోటీ పోలీసులు (SOT Police) దాడులు చేస్తున్నా.. మాదక ద్రవ్యాల వినియోగం ఆగడం లేదు. డ్రగ్స్ రవాణాలో రౌడీ షీటర్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నరగంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు.
Hyderabad Drug Tests | గంజాయి మత్తులో..
నగరంలో ఇటీవల హత్యలు, దాడులు పెరిగాయి. వీటిలో చాలా వరకు పాత నేరస్తులు నిందితులుగా ఉంటున్నారు. గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. రౌడీ షీటర్ల మధ్య గ్యాంగ్వార్లు అవుతున్నాయి. గంజాయి మత్తులో రౌడీ షీటర్లు దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతలను అదుపు చేయడంతో పాటు డ్రగ్స్ నిర్మూలన కోసం తాజాగా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. గంజాయి నెట్‌వర్క్ మూలాలను గుర్తించే పనిలో పడ్డారు.
ఇది కూడా చదవండి..: Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు
