Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Flood Control | నగరంలో వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు : హైడ్రా క‌మిష‌న‌ర్‌
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Hyderabad Flood Control | నగరంలో వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు : హైడ్రా క‌మిష‌న‌ర్‌

తెలంగాణ

Hyderabad Flood Control | నగరంలో వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు : హైడ్రా క‌మిష‌న‌ర్‌

హైదరాబాద్ నగరంలో వరదల కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తోందని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 8:25 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Hyderabad Flood Control

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Flood Control | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరదల కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తోందని హైడ్రా (Hydraa) క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ అన్నారు. వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న ప్రాంతాల‌ను గుర్తించి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో గ‌తేడాది భారీ వర్షాలు పడినా ప్రజలకు ఇబ్బందులు తలెత్తలేదన్నారు.

న‌గ‌రంలో చెరువులతో పాటు వాటిని అనుసంధానం చేసే వ‌ర‌ద కాలువ‌ల‌ పున‌రుద్ధ‌ర‌ణ చేపట్టామని వివరించారు. 24 చెరువుల పునరుద్ధరణ చేపట్టామని, ఇందులో మూడు చెరువులను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. వ‌ర‌ద‌ల ప్ర‌భావం లేని నివాస ప్రాంతాల వృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన స‌ద‌స్సులో ఆయన మాట్లాడారు. ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌ శ‌ర‌వేగంగా పెరుగుతున్న వేళ‌.. చెరువులు, కుంట‌లు, కాలువ‌లను పునరుద్ధరించుకోవాలన్నారు. చెరువులు, కాలువ‌ల ఎఫ్‌టీఎల్ (FTL), బ‌ఫ‌ర్ జోన్​ అంటే న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ప్రస్తుతం స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న వ‌చ్చింద‌న్నారు. దీంతో నిర్మాణ సంస్థ‌ల‌తో పాటు.. ఇల్లు కొనాల‌నుకునేవారు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని చెప్పారు.

Hyderabad Flood Control | పెరుగుతున్న జనాభా

దేశంలోని నగరాల్లో జనాభా భారీగా పెరుగుతోందని హైడ్రా కమిషనర్​ (Hydraa Commissioner) పేర్కొన్నారు. 1975లో హైదరాబాద్ జ‌నాభా 2.1 మిలియ‌న్ ఉంటే.. ప్రస్తుతం 13 మిలియ‌న్ల‌కు చేరిందన్నారు. కానీ స‌హ‌జ‌వ‌న‌రులు మాత్రం త‌గ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1975 నుంచి 2024 మ‌ధ్య న‌గ‌రంలో ఉన్న చెరువుల్లో 61 శాతం మాయం అయ్యాయ‌ని తెలిపారు. న‌గ‌రంలో 30 వేల నాలాలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన‌ట్టు గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేష‌న్ శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్‌, కృష్ణ‌, గోదావ‌రి బేసిన్ ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌తినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Hyderabad Flood Control

దీనిని కూడా చదవండి : Fake Paneer Seizure | మార్కెట్​లో కల్తీ పన్నీరు​ విక్రయం.. తిన్నారంటే అంతే!

Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల
Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​
Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..
KTR Letter to Amit Shah | రాష్ట్రంలో పోలీసులపై నమ్మకం పోయింది : కేటీఆర్​
TAGGED:HyderabadHyderabad Flood ControlHydraaHydraa Commissioner
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Student Exam Tragedy Student Exam Tragedy | తండ్రి మృతి.. పుట్టెడు దు:ఖంలోనూ పరీక్షకు..
Next Article Betel Leaves Dream | కలలో తమలపాకు కనిపిస్తే ఫలితం ఏమిటి.. స్వప్న శాస్త్రం చెబుతున్న నిజం ఇదే! Betel Leaves Dream | కలలో తమలపాకు కనిపిస్తే ఫలితం ఏమిటి.. స్వప్న శాస్త్రం చెబుతున్న నిజం ఇదే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?