Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు

కల్తీ మాఫియాపై హైదరాబాద్​ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 10:12 ఉద.
Srinivas Kolluri
1 వారం ago
Share
Hyderabad Food Adulteration

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Food Adulteration | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. యథేచ్ఛగా ఆహార పదార్థాలను కల్తీ చేసి విక్రయిస్తోంది. తమ లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కల్తీ దందాపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే షాపులపై దాడులు చేస్తున్న పోలీసులు తాజాగా ‘H-FAST’ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Contents
  • Hyderabad Food Adulteration | దాడులతో హడల్​
    • Hyderabad Food Adulteration |హెచ్​ – ఫాస్ట్​ పేరిట

హైదరాబాద్​లో ఏళ్లుగా కల్తీ దందా సాగుతోంది. అల్లం వెల్లుల్లి పేస్ట్​ నుంచి మొదలు పెడితే పిల్లలు తాగే పాల వరకు అన్నింటిని కల్తీ చేస్తున్నారు. పెరుగు, నెయ్యి, పన్నీరు ఇలా అన్ని కల్తీ చేస్తున్నారు. అలాగే పలు కంపెనీల ఉత్పత్తులను సైతం నకిలీవి తయారు చేస్తున్నారు. పేస్ట్​లు, సబ్బులు, సర్ఫ్​లు, షాంపులను కూడా వదలడం లేదు. నకిలీవి తయారు చేసి బ్రాండెడ్​ పేరిట మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో భారీగా లాభాలు పొందుతున్నారు. అయితే కల్తీ పదార్థాలు తింటున్న ప్రజలు అనారోగ్యం బారీన పడుతున్నారు.

Hyderabad Food Adulteration | దాడులతో హడల్​

ఆంధ్రప్రదేశ్​లోని రాజమండ్రిలో ఇటీవల కల్తీ పాలు (Adulterated Milk) తాగి పలువురు మృతి చెందారు. దీంతో హైదరాబాద్​ నగర పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు. కల్తీ మాఫియాపై చర్యలు చేపట్టారు. టాస్క్​ఫోర్స్​ పోలీసులు, ఫుడ్​ సేఫ్టీ, జీహెచ్​ఎంసీ అధికారులతో కలిసి గత 15 రోజులుగా నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. నగరంలో కల్తీ పదార్థాలు విక్రయిస్తున్న దుకాణాలు పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండటంతో నగర సీపీ సజ్జనార్​ తాజాగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Hyderabad Food Adulteration |హెచ్​ – ఫాస్ట్​ పేరిట

నగరవ్యాప్తంగా అసురక్షిత ఆహార పద్ధతులను అరికట్టేందుకు, పోలీసులు ‘H-FAST’ పేరుతో ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని ప్రారంభించారు. ఇందులో ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లతో కూడిన 28 మంది ఉంటారు. ఫుడ్​ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ బృందంలోని సభ్యులు దాడులు చేస్తారు. నిఘా, కల్తీని గుర్తించడం, న్యాయపరమైన చర్యలపై ప్రధాన దృష్టి సారిస్తారు. ప్రజలు తమ సమీపంలో ఎక్కడైన కల్తీ ఆహార పదార్థాలను గుర్తిస్తే టోల్-ఫ్రీ నంబర్​కు 8712661212 ఫోన్​ చేయాలని పోలీసులు కోరారు. హెచ్​–ఫాస్ట్​ ఆఫీస్​ను ఐపీఎస్​ అధికారి వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. ఆహార కల్తీని ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!

KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
SI Caught by ACB | యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
TAGGED:Adulterated Milkadulteration crackdownFake food productsFood safety IndiaH-FAST teamHyderabadHyderabad Food AdulterationHyderabad police action
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ramzan Holiday in AP Ramzan Holiday in AP | రంజాన్ సెలవు తేదీ మార్పు.. మార్చి 21కు షిఫ్ట్, పదో తరగతి పరీక్ష వాయిదా
Next Article Polavaram Tiger Alert Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?