అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Lakes Restoration | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట, ఓల్డ్ సిటీలోని బమృక్ నౌద్దౌలా, కూకట్పల్లి నల్లచెరువులను పునరుద్ధరించి ప్రారంభించింది.
నరగంలోని మరికొన్ని చెరువులను హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా మాదాపూర్ (Madhapur)లోని తమ్మిడికుంటతో పాటు సున్నం చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పరిశీలించారు. చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షించారు. రెండు నెలల్లో చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఐటీ కారిడార్‌కు దగ్గర ఉన్న తమ్మిడికుంటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా దిద్దాలని కమిషన్ సూచించారు. చెరువు చుట్టూ మొక్కలు పెంచాలన్నారు. పాత్ వేలు, కూర్చొని సేద దీరేందుకు వీలుగా సీటింగ్ వ్యవస్థ, పార్కులు, పచ్చిక బైళ్లు.. ఉండేలా చూడాలన్నారు.
Hyderabad Lakes Restoration | ఆ భూములను స్వాధీనం చేసుకోండి
చెరువుల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల గురించి స్వాధీనం చేసుకోవాలని రంగనాథ్ ఆదేశించారు. సున్నం చెరువు దగ్గర సర్వే నంబరు 30, 31లో ప్రభుత్వ భూమి ఉంటే కాపాడాలన్నారు. సున్నం చెరువు సమీపంలోని బోరబండ బస్తీ, ఎన్ఆర్ఆర్ పురం నుంచి వచ్చే వరద నీరు చెరువులోకి కలిసే ఇన్లెట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. మురుగు నీరు కిందకు పోయేలా డైవర్ట్ కాలువ నిర్మాణం కూడా పూర్తయ్యిందని అధికారులు వివరించారు.
దీనిని కూడా చదవండి : Encroachment Drive | ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
