Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!

కేఫ్ బహార్ సమీపంలోని సర్కారు భూమిని కాంగ్రెస్ ఎంపీ Mallu Ravi సతీమణి బన్సి దేవికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అంశంపై ప్రభుత్వం అధికారికంగా మరింత వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఈ భూమి కేటాయింపు వ్యవహారం రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశముంది.

Naresh chandan
Last updated: మార్చి 3, 2026 11:30 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Hyderabad Land Allotment
Hyderabad Land Allotment

అక్షరటుడే, హైదరాబాద్‌: Hyderabad Land Allotment | హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన భూమి కేటాయింపుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కేఫ్ బహార్ సమీపంలోని సర్కారు భూమిని కాంగ్రెస్ ఎంపీ Mallu Ravi భార్య మల్లు రాజా బన్సి దేవికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ భూమి విలువ  దాదాపు రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Contents
  • Hyderabad Land Allotment 233 గజాల స్థలం
    • Hyderabad Land Allotment రాజకీయ సంబంధాలపై చర్చ
      • Hyderabad Land Allotment ప్రభుత్వ వివరణ ఇలా..
      • ప్రతిపక్ష విమర్శలు
Hyderabad Land Allotment
Hyderabad Land Allotment

Hyderabad Land Allotment 233 గజాల స్థలం

Greater Hyderabad Municipal Corporation (జీహెచ్‌ఎంసీ) స్టాండింగ్ కమిటీ తీర్మానం నంబర్ 253 (29.01.2026) ప్రకారం.. హైదరగూడలో ఉన్న కేఫ్ బహార్ సమీపంలో 233.73 చదరపు గజాల సర్కారు భూమిని మల్లు రాజా బన్సి దేవి పేరున కేటాయించేందుకు “నో అబ్జెక్షన్” ఇచ్చినట్లు పత్రాల్లో ఉంది. జిల్లా పరిపాలన సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీర్మానంలో వెల్లడించారు.

Hyderabad Land Allotment రాజకీయ సంబంధాలపై చర్చ

మల్లు రాజా బన్సి దేవి, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సతీమణి. దీంతోపాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం Bhatti Vikramarka కుటుంబానికి బంధువు. దీంతో ఈ కేటాయింపుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకుల కుటుంబాలకు సర్కారు భూములు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

Hyderabad Land Allotment ప్రభుత్వ వివరణ ఇలా..

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం ప్రకారం.. 2012 నాటి జీఓ ఎం.ఎస్. నంబరు.571 (Revenue – ASSN.I) ప్రకారం జిల్లా పరిపాలన అవసరాల మేరకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ సిఫారసు చేసినట్లు సర్కారు చెబుతోంది. కమిటీ ఆమోదంతో కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు పత్రాల్లో వెల్లడించారు.

ప్రతిపక్ష విమర్శలు

తాజా సర్కారు నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గ్రేటర్​ నగరం నడిబొడ్డున ఉన్న ఎంతో విలువైన భూమిని రాజకీయ ప్రభావంతో కేటాయించారంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. పారదర్శకత కోసం పూర్తి వివరాలను బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
Balkonda House Theft | తాళం పగలగొట్టి.. ఇంట్లోకి చొరబడి.. బాల్కొండలో చోరీ!
March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!
Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు
Hyderabad Building Collapse | హైదరాబాద్​లో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు దుర్మరణం
TAGGED:Bhatti VikramarkaGHMC Resolution 253Government Land AllotmentHabsiguda Land IssueHyderabad PoliticsMallu Ravi NewsTelangana CongressTelangana Political Controversy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Face Recognition Schemes Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం
Next Article Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?