Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Land Encroachment | శ్మశానవాటికను వదలని అక్రమార్కులు.. కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Land Encroachment | శ్మశానవాటికను వదలని అక్రమార్కులు.. కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువ

హైదరాబాద్

Hyderabad Land Encroachment | శ్మశానవాటికను వదలని అక్రమార్కులు.. కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువ

హైడ్రా ప్రజావాణికి సోమవారం 32 ఫిర్యాదులు వచ్చాయి. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 6:29 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Hyderabad Land Encroachment

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Land Encroachment | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో భూముల రేట్లు ఆకాశాన్ని తాకడంతో కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. చివరకు శ్మశాన వాటికలను వదలడం లేదు. చెరువులు, నాలాలతో పాటు శ్మశానవాటిక స్థలాలను కబ్జా చేస్తున్నారు.

Contents
  • Hyderabad Land Encroachment | పార్క్​ ఆక్రమణకు యత్నం
    • Hyderabad Land Encroachment | శంషాబాద్​లో…

హైడ్రా (Hydraa) కార్యాలయంలో సోమవారం ప్ర‌జావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రజ అవసరాలకు కేటాయించిన స్థలాల ఆక్రమణలపై మొత్తం 32 ఫిర్యాదులు వచ్చాయి. చెరువులను బాగు చేయాలని, ఆక్రమణలు తొలగించాలని పలువురు వినతి పత్రం అందించారు. యూసుఫ్‌గూడ‌, మ‌ధురాన‌గ‌ర్ ప్రాంతాల్లో ఉన్న కృష్ణాకాంత్ పార్కులో చెరువును అభివృద్ధి చేయాల‌ని వాక‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వర్యంలో హైడ్రాను కోరారు. గ‌తంలో చెరువును చాలా వ‌ర‌కూ పూడ్చేసి పార్కును చేశార‌ని.. ఇప్పుడున్న చెరువును కొంత‌మేర విస్త‌రిస్తే వ‌ర‌దను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. నిర్వహణ లేక చెరువు దుర్గందం వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Hyderabad Land Encroachment | పార్క్​ ఆక్రమణకు యత్నం

శేరిలింగంపల్లి (Serilingampally) పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్-1 కాలనీలో పార్క్ నం.4 భూమిని కొంద‌రు ఆక్రమించడానికి యత్నిస్తున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులు పార్క్ కంపౌండ్ వాల్‌లో కొంత భాగాన్ని కూల్చివేశారన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని టీఎన్​జీవోస్​ కాలనీలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్లాట్ నంబర్ 311 ప్రాంతంలో సుమారు 300 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమించారని ఆరోపించారు.

Hyderabad Land Encroachment | శంషాబాద్​లో…

శంషాబాద్​ (Shamshabad)లోని ఎంబీ మిషన్ కంపౌండ్‌లో ఉన్న స‌మాధుల స్థలం క‌బ్జాకు గురవుతున్నట్లు ఎంబీ చర్చి, ఎంబీ సమాధుల నిర్వహణ కమిటీ ప్రతినిధి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 619లో ఉన్న చర్చి సమాధులకు స‌బంధించిన‌ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో నమోదై ఉందన్నారు. కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 618గా చూపిస్తూ రికార్డులను మార్పులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అక్రమంగా కంచెలు వేయడం, నిర్మాణ పనులు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి : Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం

Musi Beautification Project | ఇళ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు : కేటీఆర్​
Narsingi Tragedy | హైదరాబాద్​లో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం
Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలెర్ట్​.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
TAGGED:government land encroachmentgraveyard land issueHyderabad land encroachmentHyderabad parks disputeHYDRA complaintsillegal land कब्जా Hyderabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Women Federation Buildings Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు
Next Article Shabbir Ali Welfare Priority | Shabbir Ali Welfare Priority | ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత: షబ్బీర్​అలీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?