Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Land Scam | హైదరాబాద్​లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Hyderabad Land Scam | హైదరాబాద్​లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

Hyderabad Land Scam | హైదరాబాద్​లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్​ నగరంలో రూ.7 వేల కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. తెలంగాణ భవన్​లో ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 1:19 సా.
Srinivas Kolluri
4 రోజులు ago
Share
Hyderabad Land Scam

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Land Scam | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో రూ.7 వేల కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములకు రక్షణలేకుండా పోయిందన్నారు.

Contents
  • Hyderabad Land Scam | నిషేధిత జాబితాలోకి..
    • Hyderabad Land Scam | బౌన్సర్లను పెట్టి..

తెలంగాణ భవన్​లో హరీశ్​రావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. నగరంలోని నాదర్‌గుల్ (Nadergul) భూములు భూములను కొందరు ఆక్రమించారరన్నారు. ప్రభుత్వ పెద్దలే గద్దల్లా తన్నుకుపోతున్నారని ఆరోపించారు. రక్షకులే భక్షకులు అయ్యారన్నారు. చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ భూములను కాపాడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు.

Hyderabad Land Scam | నిషేధిత జాబితాలోకి..

రంగారెడ్డి (Rangareddy) జిల్లా బాలాపూర్​ మండలం నాదర్​గుల్​లోని 373 ఎకరాల భూమి శివరాజ్​ బహదూర్​కు చెందిందని 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. 2016లో ఆయన ఆ భూమిని కొన్ని కంపెనీలకు విక్రయించగా.. బదలాయింపు కోసం కంపెనీలు ఆర్డీవో దగ్గరకు వెళ్లాయన్నారు. అయితే ఆ భూమిని విక్రయం చెల్లదని ఆర్డీవో చెప్పినట్లు హరీశ్​రావు తెలిపారు. ల్యాండ్​ సీలింగ్​ యాక్ట్ ప్రకారం ఒక్క వ్యక్తికి అంత భూమి ఉండదని చెప్పి.. దానిని నిషేధిత జాబితాలో చేర్చారని తెలిపారు. RDO నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించిందని చెప్పారు. భూములపై సుప్రీం ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. భూభారతి వెబ్‌సైట్‌లో సైతం ఆ భూమి ప్రభుత్వ భూమిగా ఉందన్నారు.

Hyderabad Land Scam | బౌన్సర్లను పెట్టి..

నాదర్​గూడలోని 373 ఎకరాల భూమిని నమ్ముకొని 600 మంది పేద రైతులు బతుకుతున్నారని చెప్పారు. అయితే ఆ భూములను కొందరు కబ్జా చేశారన్నారు. గోడలు కట్టి, ఫెన్సింగ్​లు ఏర్పాటు చేశారన్నారు. ఆ భూముల్లోకి వెళ్లకుండా రైతులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బౌన్సర్లను, పోలీసులను పెట్టి వాళ్ల భూముల దగ్గరికి పోనీవకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు ఫిర్యాదు చేసినా ఆర్డీవో, హైడ్రా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూముల్లోని చెరువులు, గుట్టలను మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూముల కబ్జాలో ఓ మంత్రి హస్తం ఉందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి : Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

Konda Sushmitha | పరకాల ఎమ్మెల్యే అవుతా.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
Yellareddy MLA | అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Kaushik Reddy controversy | ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై ప్రభుత్వం సీరియస్​.. చర్యలు తీసుకునే అవకాశం
TAGGED:farmer land rightsHarish Rao newsHyderabad land scamland grabbing issuereal estate controversyTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Middle East War Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’
Next Article Khanapur Municipal Election Khanapur Municipal Election | ఖానాపూర్ మున్సిపల్‌ పీఠం బీజేపీ కైవసం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?