అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Metro Takeover | హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)పై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఎల్అండ్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
ఎల్అండ్టీ సంస్థ హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుంటామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. మెట్రో రుణంతో పాటు కొంత మేర నగదు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన తీర్మానాన్ని సీఎం (CM Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిని తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే మెట్రో విస్తరణపై చర్చించకుండా తీర్మానాన్ని ఆమోదించడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయం అంటూ నిరసన తెలిపారు.
Hyderabad Metro Takeover | మెట్రోను విస్తరిస్తాం
ప్రస్తుతం 69 కి.మీ. మెట్రో నిర్మాణం జరిగిందని సీఎం తెలిపారు. విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రెండో దశలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విస్తరణకు ఎల్అండ్టీ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకుంది.
Hyderabad Metro Takeover | ఆర్టీసీకి రూ.7,800 కోట్లు
గత ప్రభుత్వం ఆర్టీసీనీ నిర్వీర్యం చేసే కుట్ర చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 7 వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. తాము రెండేళ్లలోనే ఆర్టీసీకి రూ.7,800 కోట్లు చెల్లించామని తెలిపారు. మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme) ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Water Crisis | హైదరాబాద్లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ

