అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువతులు పిల్లుల కోసం తనువు చాలించారు.
ప్రస్తుతం చాలా మంది చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొందరికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని ప్రేమగా చూసుకుంటారు. అవి చనిపోతే కొన్ని రోజులు తీరానికి వేదనకు గురి అవుతుంటారు. అయితే నగరంలోని ఓ యువతి పెంపుడు పిల్లి చనిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోకి పిల్లిని తీసుకు రావొద్దని తల్లి మందలించడంతో మరో యువతి ప్రాణాలు తీసుకుంది.
Hyderabad Pet Tragedy | మనస్తాపంతో..
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో హిమబిందు అనే యువతి పెంపుడు పిల్లి చనిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. బడంగ్‌పేట అంజనాద్రి నివాస్ కాలనీలో నివాసం ఉంటున్న హిమబిందు (20) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఆమె కొంతకాలంగా పిల్లిని పెంచుకుంటుంది. బుధవారం తెల్లవారుజామున అది చనిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన హిమబిందు ఎలుకల మందు తిన్నది. గమనించిన తల్లి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Hyderabad Pet Tragedy | తల్లి మందలించడంతో..
నగరంలోని అల్వాల్‌లో నివాసం ఉంటున్న కుసుమలత, దేవదత్తం దంపతులకు కుమార్తె శ్రేష్ట ఉంది. ఆమె ఎంబీబీఎస్ చదువుతోంది. ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి విషయంలో శ్రేష్టకు తల్లితో వాగ్వాదం జరిగింది. దీంతో కుసుమలత పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని శ్రేష్టను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రేష్ట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.చాలా మంది పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కొందరైతే కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అవి దూరమైతే తట్టుకోలేరు. అయితే పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకోవడం నగరంలో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇది కూడా చదవండి..: Kaushik Reddy Shock | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి షాక్!

