అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Pilot Assault | హైదరాబాద్ నగరంలోని బేగంపేట (Begumpet)లో దారుణం చోటు చేసుకుంది. పైలెట్ శిక్షణ కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. శిక్షణ (Pilot Training) పేరుతో జనవరి 2025 నుంచి పలుమార్లు అత్యాచారం చేశాడు.
బేగంపేటలోని ఏవికన్స్ పైలెట్ (Avicans Pilot) శిక్షణ సంస్థలో ఓ యువతి పైలెట్ కోర్సు నేర్చుకోవడానికి జాయిన్ అయింది. సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్ ఆమెపై కన్నేశాడు. శిక్షణ పేరుతో యువతిని లోబర్చుకొని 2025 జనవరి నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఆ దారుణాలను ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని చూపించి బాధితురాలని బెదిరించాడు. అతడికి దమ్మాయిగూడ (Dammaiguda)కు చెందిన మరో ఇన్‌స్ట్రక్టర్ సల్మాన్ సహకరించడం గమనార్హం.
Hyderabad Pilot Assault | పోలీసులకు ఫిర్యాదు
పైలెట్ కావాలన్న ఆ యువతి కలలను చిదిమేస్తూ.. తోటి సిబ్బంది అత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. నసిముద్దీన్ వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నసిముద్దీన్ను అరెస్ట్ చేశారు. సల్మాన్ పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hydraa Land Protection | రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
