అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Pollution Free | హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన మండలిలో మాట్లాడారు.
హైదరాబాద్‌ను (Hyderabad) సిగ్నల్ ఫ్రీగా మార్చి, ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నగరం చుట్టూ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని తెలిపారు. మూసీ సుందరీకరణ చేపడుతామని స్పస్టం చేశారు. మానవ తప్పిదాలతోనే మూసీ నది కలుషితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నది పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Hyderabad Pollution Free | ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తాం
నగరంలో ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడుతామని సీఎం తెలిపారు. పార్కింగ్ సదుపాయాలు లేక వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వరదలు, కాలుష్యం వేధిస్తున్నాయని పేర్కొన్నారు. వీటి నుంచి హైదరాబాద్‌ను రక్షించడానికి క్యూర్, ఫ్యూర్, రేర్‌గా సిటీని విభజించామని వెల్లడించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను సిటీ బయటకు తరలిస్తామన్నారు.
Hyderabad Pollution Free | మెట్రోను విస్తరిస్తాం
నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం మెట్రోను విస్తరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే విస్తరణకు ఎల్అండ్టీ (L&T) సంస్థ సహకరించడం లేదన్నారు. దీంతో కేంద్రం సూచన మేరకు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు. కంటోన్మెంట్ ఏరియాతో ఉత్తర తెలంగాణ (Telangana) నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి సమస్య పరిష్కారం కోసం పంజాగుట్ట, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామన్నారు. రోడ్ల విస్తరణ కోసం రక్షణ శాఖ భూములపై కేంద్రంతో చర్చించినట్లు సీఎం తెలిపారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు.
Hyderabad Pollution Free | స్మార్ట్ గవర్నెన్స్
స్మార్ట్ గవర్నర్స్ దిశగా తెలంగాణ ఎదగాలని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు ఇంటికే చేరాలన్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకోకపోయినా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కి వచ్చే ఇబ్బంది ఏమి లేదన్నారు. మూసీ పక్కన 50 మీటర్ల బఫర్ జోన్‌గా నిర్ణయించింది బీఆర్ఎస్ అని చెప్పారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అవసరమైన భూములు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి..: Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నిరసన

