అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Rain Traffic | గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాలు పడితే జన జీవనం స్తంభించిపోతుందనే విషయం మరోసారి రుజువైంది. వాతావరణం నార్మల్‌గా ఉన్నప్పుడు ప్రశాంతంగా డ్రైవ్ చేస్తూ, సంగీతాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం మొదలుపెట్టిన వాహనదారులు.. ఒక్కసారిగా వర్షం కురవగానే భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోతున్నారు.
Hyderabad Rain Traffic | గండిమైసమ్మ చౌరస్తా…
మహా నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా రోడ్లపై నీరు నిల్వ నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి, ట్రాఫిక్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్, ప్రధాన జంక్షన్లు, లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. శివారు ప్రాంతంలో ఉన్న గండిమైసమ్మ చౌరస్తాతో సహా రాత్రి 9 దాటినా.. వాహనాల రద్దీ కొనసాగింది.
Hyderabad Rain Traffic | ఆర్కెస్ట్రా శబ్దాలు..
నగరంలో మొదట వర్షం చినుకులతో ప్రారంభమై, క్రమంగా కుంభవృష్టిగా మారింది. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు హారన్‌లతో “ఆర్కెస్ట్రా”లా శబ్దాలు చేస్తూ.. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది గంటల తరబడి ఒకే చోట నిలిచిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
వర్షాలకుతోడు రోడ్లపై గుంతలు, డ్రైనేజ్ సమస్యలు, నీరు నిల్వ ఉండటం వంటి అంశాలు ట్రాఫిక్ సమస్యలను మరింత పెంచుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. రాబోయే వర్షాకాలానికి ముందే మున్సిపల్ శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.

