Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

మైలార్‌దేవపల్లి-కాటేదాన్ ప్రాంతంలోని సుమిత్ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగింది.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 10:27 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Hyderabad Timber Depot Fire
Hyderabad Timber Depot Fire

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​ నగరంలో మరో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. వరుస ఫైర్​ యాక్సిడెంట్లు ప్రజలను కలవర పెడుతున్నాయి. మంగళవారం రాత్రి బాచుపల్లిలో జరిగిన ప్రమాదంలో రూ.5 కోట్ల ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. తాజగా మైలార్​దేవ్​పల్లిలో టింబర్​ డిపోలో మంటలు అంటుకుంటున్నారు.

Contents
  • Hyderabad Timber Depot Fire | రూ.కోటి ఆస్తి నష్టం
    • Hyderabad Timber Depot Fire | భయం భయంగా..
      • Hyderabad Timber Depot Fire | చర్యలు కరువు

నగరంలోని మైలార్‌దేవపల్లి-కాటేదాన్ (Mailardevapalli-Katedan) ప్రాంతంలోని సుమిత్ టింబర్ డిపో, బీడీ ప్లైవుడ్ గోడౌన్‌లో మంటలు వ్యాపించాయి. టింబర్ డిపోలో ఉన్న దుంగలు, కట్టెలకు మంటలు అంటుకుని తగలబడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టింబర్​ డిపో కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Hyderabad Timber Depot Fire | రూ.కోటి ఆస్తి నష్టం

టింబర్​ డిపో (Sumit Timber Depot) కాలిబూడిద అవడంతో రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Timber Depot Fire | భయం భయంగా..

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఇటీవల అగ్ని ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. అసలే వేసవి కాలం కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. మంగళవారం రాత్రి బాచుపల్లి దాదాపు 50 ఫర్నిచర్ దుకాణాలు కాలిపోయాయి. అంతకు ముందు జూబ్లీహిల్స్​లోని ఓ మాల్​లో మంటలు అంటుకున్నాయి. గతంలో ఓ కారు షో రూమ్​, బైక్​ షోరూమ్​లో సైతం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని బచ్చాస్​ ఫర్నిచర్​ దుకాణంలో జనవరిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. ఐదుగురు చనిపోయారు.

Hyderabad Timber Depot Fire | చర్యలు కరువు

నాంపల్లిలోని బచ్చాస్​ ఫర్నిచర్​ దుకాణంలో ప్రమాదం అనంతరం హైడ్రాతో పాటు ఇతర శాఖల అధికారులు హడావుడి చేశారు. పలు వాణిజ్య భవనాలు, దుకాణాలు, మాల్స్​లలో తనిఖీలు చేపట్టారు. ఫైర్​ సేఫ్టీ నిబంధనలు పాటించని వాటిని సీజ్​ చేశారు. ముచ్చటగా మూడు రోజులు తనిఖీలు చేసిన అధికారులు.. వ్యాపారుల వినతి మేరకు నెల రోజులు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటిలోగా ఆయా భవనాల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే ఆ నెల రోజుల గడువు ముగిసినా అధికారులు మళ్లీ తనిఖీలు ప్రారంభించలేదు. మరోవైపు నగరంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఫైర్​ యాక్సిడెంట్లు అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
Danam Nagender | దానం నాగేందర్​కు షాక్​.. అనర్హతపై హైకోర్టుకు బీజేపీ
Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
TAGGED:Fire Accidentfire safety hyderabadHyderabadhyderabad fire accidentHyderabad fire newsHyderabad Timber Depot FireMailardevapalli-Katedanproperty loss fire incidenttelangana fire accident news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Unseasonal Rains Telangana Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..
Next Article MS Dhoni Traffic Fine MS Dhoni Traffic Fine | రూల్స్ ఉల్లంఘించిన ఎంఎస్ ధోని.. ట్రాఫిక్ పోలీసులు ఎంత జ‌రిమానా విధించారంటే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?