అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad traffic restrictions | హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) సందర్భంగా హైదరాబాద్ నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నగరంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు తీస్తారు. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
నగరంలోని గౌలిగూడ (Gouliguda)లో గురువారం ఉదయం 11:30కి శోభాయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి తాడ్‌బండ్ (Tadbund) ఆలయం వరకు యాత్ర సాగుతుంది. ఊరేగింపు రూట్లలో భారీ వాహనాలపై ఆంక్షలు ఉన్నాయి. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి పారడైజ్ జంక్షన్ వరకు, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి కోఠిలోని DM&HS వరకు జరిగే శోభాయాత్రల దృష్ట్యా, కోఠి, ఆబిడ్స్, నారాయణగూడ, RTC క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ సికింద్రాబాద్‌తో సహా పలు కీలక మార్గాల్లో ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, నిలిపివేతలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Hyderabad traffic restrictions | దశల వారీగా..
శోభాయాత్ర ముందుకు సాగుతున్న కొద్దీ ట్రాఫిక్ నియంత్రణ దశలవారీగా అమలు చేస్తున్నారు. ప్రయాణికులు ఈ మార్గాలను నివారించి, LB నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, మెహిదీపట్నం మీదుగా వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ప్రజలు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకుని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
Hyderabad traffic restrictions | ఘనంగా సాగనున్న యాత్ర
ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. 12 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర రాత్రి 8 గంటలకు తాడ్‌బండ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ ప్రధాన ర్యాలీలో మరో 14 ఉపయాత్రలు కలుస్తాయి. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ మేరకు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
దీనిని కూడా చదవండి : Hydraa Demolitions Hyderabad | హైడ్రా దూకుడు.. ఐదు భారీ భవనాల కూల్చివేత
