అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Traffic Restrictions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ముందు ఉన్న రోడ్డు రెండు చివర్లలో బ్లాక్ చేశారు.
ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయేతుల్ల ఆలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ముస్లింలు నిరసన తెలిపారు. ఆదివారం పాకిస్థాన్‌లోని కరాచీలో గల యూఎస్ కాన్సులేట్ (US Consulate)పై కొందరు దాడి చేశారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో పలువురు నిరసనకారులు చనిపోయారు. హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీలో సైతం ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఖమేనీకి మద్దతుగా నినాదాలు చేశారు.
Hyderabad Traffic Restrictions | పోలీసుల చర్యలు
నగరంలోని నానక్‌రామ్‌గూడ (Nanakramguda)లోని యూఎస్ కాన్సులేట్ వద్ద నిరసనలు, దాడులు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా కార్యాలయానికి వెళ్లే రోడ్లను బ్లాక్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. భారీగా పోలీసులను అక్కడ మోహరించారు.

Hyderabad Traffic Restrictions | ఈ మార్గాల్లో వెళ్లాలి
ICICI నుంచి గౌలిదొడ్డి వైపు వెళ్లే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) జంక్షన్ వద్ద కుడివైపునకు వెళ్లాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) జంక్షన్ వద్ద ఎడమవైపునకు తిరగాలి. TNGO జంక్షన్ నుంచి కాన్సులేట్ రోడ్డు వైపు వెళ్లే వారు కృతుంగా రెస్టారెంట్ వద్ద లెఫ్ట్‌కు తిరగాలి. ప్రిజం రోడ్డులోకి ప్రవేశించకుండా లెమన్ ట్రీ హోటల్ (Lemon Tree Hotel) వద్ద టర్న్ తీసుకోవాలి. అనంతరం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లాలి. వాహనదారులు డైవర్షన్ బోర్డులను అనుసరించి ట్రాఫిక్ సిబ్బందితో సహకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Water Supply | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. జలమండలికి 3.95 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

