Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ

హైదరాబాద్​లో నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో పలువురు ప్రైవేట్​ ట్యాంకర్ల నిర్వాహకులు ప్రజలను దోపిడీ చేస్తున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 12:32 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Hyderabad Water Crisis

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Water Crisis | ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటాయి. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దీంతో నీటి కోసం నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేట్​ వాటర్​ ట్యాంకర్ల నిర్వాహకులు ప్రజలను దోచుకుంటున్నారు.

Contents
  • Hyderabad Water Crisis | కఠిన చర్యలు
    • Hyderabad Water Crisis | బోరుబావుల నుంచి

నగరంలో జలమండలి అధికారులు వాటర్​ ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. అయితే పలు ప్రాంతాల్లో ప్రైవేట్​ ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ట్యాంకర్ల దందా జోరుగా సాగుతుంది. శివారు ప్రాంతాల నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తున్నారు. దీని కోసం ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా చెరువుల్లో నుంచి కలుషిత నీటిని సైతం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కొందరు ట్యాంకర్ల యజమానులు జల మండలి పేరుతో సరఫరా చేస్తున్నారు. వారికి అధికారులు వార్నింగ్​ ఇచ్చారు.

Hyderabad Water Crisis | కఠిన చర్యలు

జలమండలి అధికారిక లోగోను కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రైవేట్ నీటి ట్యాంకర్ యజమానులు అనధికారికంగా వినియోగిస్తున్నట్లు జలమండలి దృష్టికి వచ్చింది. అనుమతి లేకుండా లోగో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రైవేట్ ట్యాంకర్లు జలమండలి లోగోను ఉపయోగించడం వల్ల, ఆ ట్యాంకర్లు ప్రభుత్వ సేవల భాగంగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, మోసపూరిత చర్యగా పేర్కొన్నారు.

Hyderabad Water Crisis | బోరుబావుల నుంచి

ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు సాధారణంగా బోర్‌వెల్‌ల నుంచి సేకరిస్తారు. ఈ నీరు జలమండలి ప్రమాణాల ప్రకారం శుద్ధి చేసింది కాదు. అలాగే నాణ్యత పరీక్షలు కూడా చేయరు. దీంతో ఆ నీటిని వినియోగిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లపై ఆధారపడవద్దని కోరారు. తాగునీటి కోసం ట్యాంకర్లను బుక్ చేసుకునే సందర్భంలో జలమండలి అధికారిక కస్టమర్ కేర్ సేవల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 155313 కు కాల్ చేసి, సురక్షితమైన, శుద్ధి చేసిని తాగునీటిని పొందవచ్చని వివరించారు.

ఇది కూడా చదవండి : Footpath Encroachments | ఫుట్​పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం

Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు
Kavitha Slams Revanth | సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం
Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
Goa liquor smuggling | గోవా నుంచి మద్యం.. షాక్​ ఇచ్చిన పోలీసులు
iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..
TAGGED:drinking water safetyHyderabadHyderabad newshyderabad waterHyderabad Water Crisisjalmandaliprivate tankerssafe water supplyTanker Ownerswater crisiswater fraud
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article IPL Betting Warning IPL Betting Warning | బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. యువతకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి
Next Article Nizamabad Municipal Budget Nizamabad Municipal Budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​ సమావేశం ప్రారంభం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?