అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Water Supply Disruption | హైదరాబాద్ (Hyderabad) నగరంలో పైప్‌లైన్ ధ్వంసం కావడంతో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో జల మండలి అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు.
నగరంలోని బుల్కాపూర్ (Bulkapur) వద్ద సోమవారం తెల్లవారుజామున 1200 ఎంఎం డయా పిఎస్ సి గ్రావిటీ మెయిన్ పైప్ లైన్ ధ్వంసం అయింది. దీంతో సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి (MD Ashok Reddy) తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో చర్చించారు.ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్‌మిషన్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు.
Hyderabad Water Supply Disruption | ట్యాంకర్లతో సరఫరా
లీకేజీతో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని జలమండలి ఎండీ సూచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.సింగపూర్ నుంచి ఖానాపూర్ వరకు వెళ్లే 1200 మిమీ డయా గల పిఎస్ సి గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు బుల్కాపూర్ గ్రామం వద్ద పగిలిపోయింది. దీంతో అధికారులు వెంటనే నీటి సరఫరాను నిలివేశారు. ఉదయం 7 గంటలకు మరమ్మతులు ప్రారంభించారు. సోమవారం రాత్రి 10 గంటలలోపు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పనులు పూర్తయిన తర్వాత నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
Hyderabad Water Supply Disruption | ప్రభావిత ప్రాంతాలు
పైప్‌లైన్ మరమ్మతులతో పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. గండిపేట్, కొకాపేట్, నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండ, షేక్‌పేట్ రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు.. బోజగుట్ట రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

