Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: HYDRAA Demolition | రోడ్డుకు అడ్డంగా నిర్మాణం.. కూల్చివేసిన హైడ్రా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - HYDRAA Demolition | రోడ్డుకు అడ్డంగా నిర్మాణం.. కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్

HYDRAA Demolition | రోడ్డుకు అడ్డంగా నిర్మాణం.. కూల్చివేసిన హైడ్రా

సికింద్రాబాద్‌ బ‌న్సీలాల్‌పేట విలేజ్‌లోని న్యూ బోయిగూడలో 20 అడుగుల ర‌హ‌దారికి అడ్డంగా నిర్మిస్తున్న ఇంటిని హైడ్రా కూల్చి వేసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 9:08 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
HYDRAA Demolition

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA Demolition | రోడ్డుకు అడ్డంగా చేపట్టిన నిర్మాణాన్ని హైడ్రా (Hydraa) కూల్చి వేసింది. సికింద్రాబాద్‌, బ‌న్సీలాల్‌పేట విలేజ్‌లోని న్యూ బోయిగూడలో 20 అడుగుల ర‌హ‌దారికి అడ్డంగా నిర్మిస్తున్న ఇంటిని బుధవారం కూల్చి వేసింది.

బోయిగూడలో సిమెంట్ రోడ్డు (Cement Road) వేసి రాక‌పోక‌లు సాగిస్తున్నా ప‌ట్టించుకోకుండా.. ఓ వ్యక్తి 20 అడుగుల ర‌హ‌దారిని 10 అడుగుల మేర 50 గ‌జాల వ‌ర‌కూ ఆక్ర‌మించాడు. కింద‌న షాపు, పైన నివాసం ఉండేలా నిర్మాణాన్ని చేపట్టాడు. దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గతంలో రోడ్డుపై చిన్న డబ్బా పెట్టుకొని జీవించేవాడని, ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును పది అడుగుల మేర ఆక్రమించడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో హైడ్రా సిబ్బంది బుధవారం జేసీబీ (JCB)లతో వెళ్లి రోడ్డుపై నిర్మించిన భవనాన్ని తొలగించారు.

HYDRAA Demolition | బంజారాలేక్‌ను ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్‌

ప్ర‌జావాణి ఫిర్యాదుల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ (Hydraa Commissioner) రంగ‌నాథ్ క్షేత్ర‌స్థాయిలో బుధ‌వారం ప‌ర్య‌టించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్​ 1లోని తాజ్ బంజారా లేక్‌ను ప‌రిశీలించారు. శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లిలోని చెరువులు, వ‌ర‌ద కాలువ‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను ప‌రిశీలించారు. బంజారా లేక్ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురవ్వడంతో పాటు క‌లుషిత‌మై దుర్గంధ‌భ‌రితంగా మారింద‌ని ఎమ్మెల్యే దానం నాగేందర్​తో పాటు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్​ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువులో ఆక్రమణలను తొలగించి పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్​ హామీ ఇచ్చారు. నాలాలను మూసివేసి వరద ముప్పునకు కారణమయ్యే నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : Flood Water Management | వ‌ర‌ద నీరు చెరువులకు చేరేలా చర్యలు : హైడ్రా కమిషనర్

Hyderabad traffic restrictions | హైదరాబాద్​లో రేపు ట్రాఫిక్​ ఆంక్షలు
Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!
POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ
TAGGED:GHMC actionHyderabad civic issuesHYDRAA demolitionillegal construction removalroad encroachmentSecunderabad newsurban development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kitchen Sponge Bacteria Kitchen Sponge Bacteria | వంటగదిలో అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఇదే.. దీనిని మార్చలేదో ఈ రోగాలు గ్యారెంటీ!
Next Article Electricity Bill Saving Electricity Bill Saving | సమ్మర్‌లో కరెంటు బిల్లు షాక్ ఇస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో సగం బిల్లు ఆదా చేసుకోండిలా!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?