అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA encroachment drive | ఆక్రమణలపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపింది. మంగళవారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పలు చోట్ల ఆక్రమణలను తొలగించింది. ఐటీ కారిడార్‌కు చేరువలో మంచిరేవుల వద్ద ఉన్న 8.24 ఎకరాల నాగిరెడ్డి కుంటను కాపాడింది.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా గండిపేట మండలం, మంచిరేవులలో చెరువును కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. బడా నిర్మాణ సంస్థలు 8.24 ఎకరాల నాగిరెడ్డి కుంటకు నలువైపులా కబ్జాలకు తెరదీశాయి. అక్కడ చెరువు ఉన్నట్లు తెలియకుండా ఓ సంస్థ ఏకంగా 20 ఫీట్ల టిన్ షీట్స్‌తో ప్రహరీ నిర్మించి 4 ఎకరాలకు ఫెన్సింగ్ వేసింది. ఇంకో సంస్థ 3 ఎకరాలను కబ్జా చేసింది. స్థానిక మాజీ ప్రజాప్రతినిధి కూడా ఎకరానికిపైగా కబ్జా చేసి విక్రయించాడు. తాజాగా హైడ్రా అధికారులు చెరువు ఆక్రమణలు తొలగించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
HYDRAA encroachment drive | రహదారిపై షాపుల దందా
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బౌరంపేట పరిధిలో గండిమైసమ్మ–మియాపూర్ ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన షాపులను హైడ్రా మంగళవారం తొలగించింది. 150 అడుగుల ప్రధాన రహదారికి ఇరువైపులా ఓ వ్యక్తి ఆక్రమణలకు పాల్పడి తాత్కాలిక షెడ్డులు వేశాడు. వాటిని అద్దెకు ఇస్తూ ఆదాయం ఆర్జిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైడ్రా చర్యలు చేపట్టింది. రహదారిని ఆనుకుని నిర్మించిన 10 షాపులు(షెడ్డులు)ను తొలగించింది.
HYDRAA encroachment drive | పార్కును కాపాడిన హైడ్రా
ఘట్కేసర్ (Ghatkesar) మండలం అవుషాపూర్ పరిధిలో 1987లో 60 ఎకరాల మేర లే ఔట్ వేశారు. ఇందులో 1440 గజాల స్థలాన్ని పార్కుకోసం కేటాయించారు. తర్వాత కొన్నాళ్లకు దానిని ప్లాట్లుగా మార్చారు. దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలం చుట్టూ హైడ్రా అధికారులు మంగళవారం ఫెన్సింగ్ వేశారు.
దీనిని కూడా చదవండి : Bike Stunt Case | పోలీసుల ముందు బైక్‌తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
